Share News

అమిత్‌ షాను నమ్మే స్థితిలో లేరా?

ABN , Publish Date - Mar 13 , 2026 | 05:08 AM

తెలంగాణలో ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆర్‌ అయితే.. దేశంలో ఫిరాయింపుల మాస్టర్‌ అమిత్‌ షా అని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు.

అమిత్‌ షాను నమ్మే స్థితిలో లేరా?

  • బండి సంజయ్‌కు కాంగ్రెస్‌ ఎంపీ చామల ప్రశ్న

న్యూఢిల్లీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆర్‌ అయితే.. దేశంలో ఫిరాయింపుల మాస్టర్‌ అమిత్‌ షా అని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్పీకర్‌ నిర్ణయంపై హైకోర్టుకువెళ్తామని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అంటుంటే.. స్పీకర్‌ అధికారాలపై కోర్టులు జోక్యం చేసుకోలేవని పార్లమెంట్‌ సాక్షిగా అమిత్‌ షానే చెప్పారని ఎద్దేవా చేశారు. అమిత్‌ షా మాటలను విశ్వసించే స్థితిలో బండి సంజయ్‌ లేరా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ మాటలను ప్రజలు నమ్మట్లేదని రంగంలోకి బీజేపీ దిగిందన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 05:08 AM