Krishna Basin Projects: కృష్ణా ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:51 AM
కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.....
బీఆర్‌ఎ్‌సపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల ధ్వజం
హైదరాబాద్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనంతరం సభలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ.. నార్లాపూర్ దగ్గర ఒక్కరోజు స్విచ్ ఆన్ చేసి ప్రాజెక్టు పూర్తయిందన్నట్టు బీఆర్‌ఎస్ గొప్పలు చెప్పిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయాంలో చేపట్టిన పనుల్లో ధనం పారిందే తప్ప... ఎక్కడా ప్రాజెక్టుల్లో నీళ్లు పారలేదన్నారు. ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ..పాలమూరు-రంగారెడ్డిని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని కోరారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ మాట్లాడుతూ.. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ విషయంలోనూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందన్నారు.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ పాలమూరు ఇప్పటికీ బీడుగా మిగిలిందంటే కేసీఆర్ చేసిన పాపమేనని ఆరోపించారు.