Share News

నా వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా..!

ABN , Publish Date - Mar 17 , 2026 | 05:30 AM

బ్రాహ్మణ సామాజిక వర్గంపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల తుంగతుర్తి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మందుల సామేలు విచారం వ్యక్తం చేశారు. బ్రాహ్మణులను కించపరిచే ఉద్దేశంతో తాను మాట్లాడలేదని..

నా వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా..!

  • బ్రాహ్మణులను కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదు

  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మందుల సామేలు వివరణ..

హైదరాబాద్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): బ్రాహ్మణ సామాజిక వర్గంపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల తుంగతుర్తి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మందుల సామేలు విచారం వ్యక్తం చేశారు. బ్రాహ్మణులను కించపరిచే ఉద్దేశంతో తాను మాట్లాడలేదని.. తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే ఆ పదాలను వెనక్కి తీసుకుంటున్నానన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బ్రాహ్మణులను కలుపుకొని పనిచేశానని గుర్తు చేశారు. బ్రాహ్మణులను బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని.. ఈ విషయాన్ని వారు గమనించాలని సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్‌ పెట్టాలని సామేలు కోరారు.

Updated Date - Mar 17 , 2026 | 05:30 AM