Share News

తెలంగాణకు నువ్వెవడివి కేటీఆర్‌: బల్మూరి, అద్దంకి

ABN , Publish Date - Feb 10 , 2026 | 04:34 AM

అసలు తెలంగాణకు నువ్వెవడివి.. ఉద్యమంలో నీ పాత్ర ఏందంటూ కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్‌, అద్దంకి దయాకర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణకు నువ్వెవడివి కేటీఆర్‌: బల్మూరి, అద్దంకి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్ర జ్యోతి): అసలు తెలంగాణకు నువ్వెవడివి.. ఉద్యమంలో నీ పాత్ర ఏందంటూ కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్‌, అద్దంకి దయాకర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ భవిష్యత్తు గల్లంతవుతుందన్న భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా భాష మార్చుకోకపోతే కేటీఆర్‌ను, కేసీఆర్‌ను పిచ్చికుక్కల్లా ఉరికించి కొడతారని వారు హెచ్చరించారు. కేటీఆర్‌ కథ ముగిసిందని.. సిరిసిల్ల మునిసిపాలిటీలో బీఆర్‌ఎ్‌సను చిత్తుగా ప్రజలు ఓడించబోతున్నారని బల్మూరి అన్నారు. సొంత చెల్లికి సమాధానం చెప్పలేని కేటీఆర్‌.. మూసీలో దూకాలని ఘాటుగా విమర్శించారు. ఈ పనికిరాని సన్నాసి వల్ల ఎంత నష్టపోయారో కేసీఆర్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పారు. కేటీఆర్‌కు మానసిక పరిస్థితి బాగాలేదంటూ.. అందుకే ఔషధాలు పంపుతున్నానని కాంగ్రెస్‌ మీడియా కమిటీ చైర్మన్‌ సామ రామ్మోహన్‌ రెడ్డి చెప్పారు. తప్పుడు మెడిసిన్‌ వాడటం వల్లే ఆయన పరిస్థితి ఇలా మారిందని ఎద్దేవా చేశారు.

Updated Date - Feb 10 , 2026 | 04:34 AM