రైతులను దోచుకుంటున్న కాంగ్రెస్ నాయకులు
ABN , Publish Date - May 23 , 2026 | 11:29 PM
ధాన్యం కొనుగోళ్లలో అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు మిల్లర్లతో కుమ్ముక్కై రైతులను దోచుకుంటున్నారని బీజేపీ జిల్లా అఽధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ ఆరోపించారు. తరుగు పేరిట ఒక్కో ధాన్యం లారీపై రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు దోచుకొని పంచుకుంటున్నారని పేర్కొన్నారు.
-బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్
నెన్నెల, మే 23 (ఆంధ్రజ్యోతి)
ధాన్యం కొనుగోళ్లలో అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు మిల్లర్లతో కుమ్ముక్కై రైతులను దోచుకుంటున్నారని బీజేపీ జిల్లా అఽధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ ఆరోపించారు. తరుగు పేరిట ఒక్కో ధాన్యం లారీపై రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు దోచుకొని పంచుకుంటున్నారని పేర్కొన్నారు. మండల పార్టీ నాయకులతో కలిసి జోగాపూర్ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. రైతుతో మాట్లాడి వారి సాదకబాదకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు సెంటర్లలో రాశులు పోసుకొని కొనేవారి కోసం నెలల తరబడి ఎదురు చూస్తూ రైతులు అరిగోస పడుతున్నారని అన్నారు. సెంటర్లలో కనీస సౌకర్యాలు కూడా లేవన్నారు. కాంటాలో జాప్యం, గన్ని సంచులు, లారీల కొరతతో ధాన్యం సేకరణ మందకోడిగా సాగుతుందన్నారు. కిందామీదాపడి మిల్లుకు చేరితే అక్కడ ఎంత కటింగ్ పెడతారో తెలియకుండా ఉందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏసీ గదులు వదిలి వరికళ్లాలకు వస్తే రైతుల కష్టం ఏంటో తెలుస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, పార్టీ మండల అధ్యక్షులు అంగలి శేఖర్, నాయకులు పులగం తిరుపతి, శైలెందర్‌సింగ్, శ్రీనివాస్‌గౌడ్, జగదీష్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.