Share News

ఓట్లే కాదు.. పార్టీలనూ చోరీ చేస్తున్న బీజేపీ

ABN , Publish Date - Jun 23 , 2026 | 02:33 AM

ఓట్లు, సీట్లే కాదు.. పార్టీలనూ బీజేపీ చోరీ చేస్తుందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఆరోపించారు. హనుమకొండలో ...

ఓట్లే కాదు.. పార్టీలనూ చోరీ చేస్తున్న బీజేపీ

  • ఎస్‌ఐఆర్‌తో వ్యతిరేక ఓట్లను తొలగించేందు కుట్ర

  • బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి: మీనాక్షి నటరాజన్‌

వరంగల్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఓట్లు, సీట్లే కాదు.. పార్టీలనూ బీజేపీ చోరీ చేస్తుందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఆరోపించారు. హనుమకొండలో ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఓట్ల చోరీకి పాల్పడి, దొడ్దిదారిలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. చివరకు తన రాజ్యసభ సీటును కూడా చోరీ చేశారని దుయ్యబట్టారు. ఆ పార్టీకి రాజకీయ, ప్రజాస్వామ్య నైతిక విలువలు లేవని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ పట్ల బూత్‌ లెవల్‌ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటింటికి తిరిగి ఓటర్లకు అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాలని కోరారు.

Updated Date - Jun 23 , 2026 | 02:33 AM