కాంగ్రెస్ పేద ప్రజల ప్రభుత్వం
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:34 AM
పేద ప్రజల ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో సోమవారం 502 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
చందుర్తి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజల ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో సోమవారం 502 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గరీబీ హఠావో అని పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగిస్తున్నా మని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకా లను ప్రతి గ్రామంలో, ప్రతి గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు. గత ప్రభుత్వ ఆర్థిక నిర్ణయాల ప్రభావం ఇప్పటికీ రాష్ట్రంపై ఉందని విమర్శిం చారు. జిల్లాలో అర్హులైన పేదలకు కొత్తగా 8,052 పెన్షన్లు మంజూ రు చేస్తున్నట్లు ఆది శ్రీనివాస్ వెల్లడించారు. చందుర్తి మండలంలో ఇప్పటికే 6,475 మంది పెన్షన్లు పొందుతుండగా, తాజాగా మరో 502 మందికి కొత్తగా పెన్షన్లు అందిస్తున్నామన్నారు. కొత్త పెన్షన్లతో కలిపి ప్రతి నెలా రూ. 1,52,87,232 మొత్తాన్ని పెన్షన్ల రూపంలో లబ్ధిదారులకు అందించనున్నట్లు వివరించారు.
పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా
పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెడుతు న్నారని తెలిపారు. ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతి సంద ర్భంగా సిద్దిపేటలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొ న్నారు. రేషన్ కార్డు కలిగిన అర్హులైన పేద కుటుంబాలకు కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో రూ.5 లక్షల జీవిత బీమా అందిం చాలన్నది ఈ పథకం ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. వేములవాడ రాజరా బజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. కార్యకరమంలో ఎంపిడివో రాధ, తహాశీల్దార్ భూపతి, ఎఎంసి చైర్మన్ చెల్కల తిరుపతి, వైస్ చైర్మన్ బోజ్జ మల్లేశం, సింగిల్ విండో చైర్మన్లు గసికంటి ప్రభాకర్, ఎగోళం శ్రీనివాస్, ఆత్మకమిటి చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి, మాజీ జడ్పిటిసి సభ్యుడు నాగం కుమార్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఉప సర్పంచ్‌లు, లభ్ధిదారులు పాల్గొన్నారు.