కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లోఫిరాయింపు ఎమ్మెల్యేల జోక్యమేంటి?
ABN , Publish Date - Mar 18 , 2026 | 05:43 AM
కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల జోక్యం ఏమిటని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం జగిత్యాలలో...
పార్టీకి రాజీనామా యోచనకు..జగిత్యాల ఎమ్మెల్యే, అధిష్ఠానమే కారణం: జీవన్‌రెడ్డి
జగిత్యాల, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల జోక్యం ఏమిటని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం జగిత్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను కాంగ్రె్‌సకు రాజీనామా చేయడానికి యోచించే పరిస్థితికి కారణం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆయన వెనుక ఉన్న నేతలేనని స్పష్టం చేశారు. ఇందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సైతం బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కార్యకర్తలు, అనుచరుల అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకుంటానన్నారు. నాలుగు దశాబ్దాల బంధాన్ని విడిచిపెట్టుకోవడం ఇబ్బందేనని.. ఆ స్థితిలో తాను ఇవాళ బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత ఇబ్బంది ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నానో అర్థం చేసుకోవాలన్నారు. సంజయ్ ఒత్తిడితో జగిత్యాల మునిసిపాలిటీలో ఓ ఆడబిడ్డ ఇబ్బంది పడింది నిజం కాదా అని ప్రశ్నించారు. జగిత్యాల కాంగ్రెస్ లో ఉత్పన్నమైన సమస్యకు పరిష్కారం కనపడటం లేదని, అభిమనాన్ని చంపుకొని ఉండడం సాధ్యం కాదని అన్నారు.