Share News

బీసీలే కేంద్రంగా ప్రజా పాలన

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:17 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజా పాలన బీసీ సెంట్రిక్‌గా నడుస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ చెప్పారు.

బీసీలే కేంద్రంగా ప్రజా పాలన

  • టీపీసీసీ ఓబీసీ సెల్‌ విస్తృత సమావేశంలో మహే్‌షగౌడ్‌

హైదరాబాద్‌, జనవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజా పాలన బీసీ సెంట్రిక్‌గా నడుస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ చెప్పారు. కులగణన సర్వే ద్వారా రాష్ట్రంలో బీసీ జనాభా 56 శాతంగా ఉందంటూ అధికారిక డాక్యుమెంట్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ ఓబీసీ సెల్‌ విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కోసం 3చట్టాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువస్తే అవి రాష్ట్రపతి, గవర్నర్‌ల వద్ద పెండింగ్‌లో పెట్టారని మహేశ్‌గౌడ్‌ ఆరోపించారు. 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయమని, అప్పుడు బీసీలకు 42శాతం రిజర్వేషన్‌పై చట్టబద్దత తెచ్చుకుంటామన్నారు. పార్టీ కోసం పాతికేళ్లు కష్టపడిన శంకర్‌నాయక్‌, అద్దంకి దయాకర్‌లను ఎమ్మెల్సీలుగా పదోన్నతి ఇచ్చామని, పీసీసీ కార్యవర్గంలో సగం మంది బీసీలేనన్నారు. మున్సిపల్‌ ఎన్నికల దృష్ట్యా నామినేటెడ్‌ పదవుల భర్తీ పెండింగ్‌లో పడిందని చెప్పారు. కాగా, కేంద్ర మంత్రిలా కాకుండా బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధిలా కిషన్‌రెడ్డి వ్యవహారం ఉందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌ సామా రామ్మోహన్‌రెడ్డి చెప్పారు. సైట్‌ విజిట్‌ అనే నిబంధన గుజరాత్‌ సహా దేశవ్యాప్తంగానూ ఉందని చెప్పారు.

Updated Date - Jan 23 , 2026 | 04:17 AM