Share News

ఆర్టిజన్‌లను పట్టించుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:49 PM

సమస్యలను పరిష్క రించాలని డిమాండ్‌ చేస్తూ ఐదు రోజులుగా మంచిర్యాలలోని సబ్‌ స్టేషన్‌ వద్ద సమ్మె చేస్తున్న విద్యుత్‌ ఆర్టిజన్‌ కార్మికులను కాంగ్రెస్‌ ప్రభుత్వం ప ట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి పేర్కొ న్నారు.

ఆర్టిజన్‌లను పట్టించుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం
సమ్మె శిబిరంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి) : సమస్యలను పరిష్క రించాలని డిమాండ్‌ చేస్తూ ఐదు రోజులుగా మంచిర్యాలలోని సబ్‌ స్టేషన్‌ వద్ద సమ్మె చేస్తున్న విద్యుత్‌ ఆర్టిజన్‌ కార్మికులను కాంగ్రెస్‌ ప్రభుత్వం ప ట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి పేర్కొ న్నారు. ఆదివారం విద్యుత్‌ ఆర్టిజన్‌ల సమ్మె శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ కార్మికుల శ్రమను కాంగ్రెస్‌ ప్రభుత్వం దోపిడి చేస్తుందన్నారు. వీరిని గతం లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యుత్‌ ఆర్టిజన్‌లు, బిల్‌ కలెక్టర్లు అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారని, వారికి స్టాండింగ్‌ ఆర్డర్స్‌ రద్దు చేసి ఏపీఎస్‌ఈబీ రూల్స్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ నాగ రాజు, కమలా కర్‌రావు, చక్రవర్తి, జయరామరావు, మల్లేష్‌, రాజన్న పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2026 | 11:49 PM