Share News

కాంగ్రెస్‌ ప్రభుత్వం.. పేదల ప్రభుత్వం

ABN , Publish Date - May 01 , 2026 | 11:16 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా పేదల ప్రభు త్వం అని పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేషపెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్‌ ప్రభుత్వం అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అ న్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం.. పేదల ప్రభుత్వం

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

లక్షెట్టిపేట, మే 1(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా పేదల ప్రభు త్వం అని పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేషపెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్‌ ప్రభుత్వం అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అ న్నారు. లక్షెట్టిపేట పట్టణంలోని ఎస్‌పీఆర్‌ గార్డెన్స్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి షాదీ ముభాకర్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సంక్షేమ మే ధ్యేయంగా ముందుకు సాగుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏపథకం పెట్టిన అది మహిళల పేరున మాత్రమే పెడుతుందన్నారు. గృహజ్యోతి పథకంతో ఉచిత కరెంటు, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లను కూడా మహిళల పేరునే పథకం రూపు దిద్దడం జరిగిందని అన్నారు. అనంతరం దండేపల్లి, లక్షెట్టిపేట మండలాలకు చెందిన లబ్దిదారులకు మంజూరు అయి న చెక్కులను పంపిణీ చేసారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దొంత అంజలినర్సయ్య, వైస్‌ చైర్మన్‌ రాజేశ్వరి, తహసీల్దార్‌ దిలీప్‌కుమార్‌, జి ల్లా ఆర్పీఆర్‌ఎస్‌ అద్యక్షుడు గడ్డం త్రిమూర్తి, మేయర్‌ దర్ని మఽధుకర్‌, ఆర్టీఏ మెంబర్‌ అంకతి శ్రీనివాస్‌, పార్టీ పట్టణ అద్యక్షుడు ఆరీప్‌, మండల అద్యక్షు డు రమేష్‌, నాయకులు చెల్ల నాగభూషణం, చింత అశోక్‌తో పాటు కౌన్సిల ర్లు, కోఆర్షన్‌ సభ్యులు, పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2026 | 11:16 PM