హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:17 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇ చ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందిందని ఆరోపిస్తూ నస్పూర్ త హసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం బీజేపీ నాయకులు ధర్నా నిర్వహిం చారు.
నస్పూర్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇ చ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందిందని ఆరోపిస్తూ నస్పూర్ త హసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం బీజేపీ నాయకులు ధర్నా నిర్వహిం చారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ సంతోష్ కుమార్‌కు అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అరు గ్యారెంటీల హామీలు ఇచ్చి అమలులో విఫలం చెందిందని ఆరోపించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ నాయకులు సత్రం రమేష్, కుర్ర చక్రవర్తి, కమాలాకర్‌రావు, సదానందం, శ్రీనివాస్, శ్రీకాంత్, సతీష్, తిరుపతి, చిరంజీవి, మహేష్, రేణుక, దా సరి పద్మ, శిరీష, జ్యోతి, విక్రమ్ పాల్గొన్నారు.
లక్షెట్టిపేట: బీజేపీ నాయకులు స్థానిక తహసీల్దార్ దిలీప్‌కుమార్‌కు కార్యాల యంలో వినతిపత్రం అందజేసారు. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లా డుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 420హామీలను వెంట నే అమలు చేయాలన్నారు. కార్యాలయం ముందు కూర్చుని దర్నా చేపట్టిన అనం తరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసారు. ఈకార్యక్రమంలో బీజేపీ పట్టణ అద్యక్షుడు హరిగోపాల్‌రావు, మండల అద్యక్షుడు హేమంత్‌రెడ్డి, జిల్లా కోశాధికారి రమేష్‌జైన్, వెంకటరమణ, రాజేందర్, గురువయ్య, సతీష్, ప్రభాకర్, వాసు, రమేష్, రవి, సుధాకర్, చంద్రయ్య, గంగన్న, దేవేందర్, శంకర్ పాల్గొన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్ : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. సోమ వారం మంచిర్యాలలోని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ గర్మిళ్ల జోన్ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్‌కుమార్ మాట్లాడుతూ నెరవేర్చని హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. జిల్లాలోని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభ్వుం అమలు చేయాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాగరాజు, నాయకులు సత్యనారాయణ, కుమార్, సత్యనారాయణ, లచ్చన్న, జయరాంరావు, శ్రీధర్, మనోజ్, శ్రీను, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.