Share News

kumaram bheem asifabad- హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

ABN , Publish Date - Sep 02 , 2026 | 11:12 PM

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని, వెయ్యి రోజుల్లో అభివృద్ధి చేయకుంఆ సంబరాలు చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం వేయి రోజుల కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో ధర్నా నిర్వహించారు.

kumaram bheem asifabad- హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం
ఆసిఫాబాద్‌లో ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీఆర్‌ఎస్‌ నాయకులు

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని, వెయ్యి రోజుల్లో అభివృద్ధి చేయకుంఆ సంబరాలు చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం వేయి రోజుల కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేయి రోజుల పాలనలో ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఇచ్చిన 420 హామీలు తుంగలో తొక్కారని ఆరోపించారు. దివ్యాంగులకు పెన్షన్‌ పెంచుతామని, కౌలు రైతులకు భరోసా ఇస్తామని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లకు తులం బంగారం అదనంగా ఇస్తామని, ఇలా నోటికి వచ్చిన హామీలు ఇచ్చారని అన్నారు. వాటిలో ఒక్కటి కూడా నేరవేర్చలేదని ఆరోపించారు. హామీలు నేరవేర్చని ప్రభుత్వం ప్రజాపాలన అంటూ ప్రజలను మోసం చేయడమే కాకుండా సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళుతామని అన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేయనున్నట్లు తెలిపారు. ప్రజాసమస్యలు పక్కన పెట్టి అంతర్గత కుమ్ములాటకు నాయకులు ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. వేయి రోజుల్లో జిల్లాలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. అంతకు ముందు భారీ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్‌ బాకీ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఆకాష్‌, అహ్మద్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు ఆలీబీన్‌ అహ్మద్‌, సంజీవ్‌, కౌన్సిలర్లు చిలూవేరి వెంకన్న, బాలకృష్ణ, నాయకులు సరస్వతి, శ్రీనివాస్‌, కలాం, లాలా, మండల పార్టీ అధ్యక్షులు జాబరి రవిందర్‌, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ విఫలమైన పాలన కొనసాగిస్తోందని సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో వెయ్యి రోజుల విఫలమైన కాంగ్రెస్‌ పాలనపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ బాకీ కార్డులను పంపిణీ చేశారు. వృద్ధులకు రూ.4వేల ఇస్తామని ఇంత వరకు అమలు లేదన్నారు. అలాగే మహిళలకు ప్రతీ నెల రూ.2500 ఇస్తామని చెప్పి మోసం చేసినట్టు గుర్తు చేశారు. ఇక విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని పత్తాలేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పాలనలో రైతుల ఆత్మహత్యలు, గురుకుల విద్యార్థుల మరణాలు, చేనేత కార్మికులు, ఆటో కార్మికులు ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నట్లు వివరించారు. మూడు లక్షల 75 వేల మంది పింఛన్లలో కోత విఽధించినట్టు పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబాకర్‌, రైతు బీమా వంటి పథకాలు నిలిచి పోయినట్టు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమెందన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరు తెన్నులు ఇంటింటా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్‌ కోనేరు కృష్ణారావు, బీఆర్‌ఎస్‌ నాయకులు కొంగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2026 | 11:12 PM