హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:14 PM
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి 1000 రోజులు గడుస్తున్నా ప్రజలకి చ్చిన 420 హామీలను అమలు చేయడంలో పూ ర్తిగా విఫలమైందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు.
- రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి
- పాలనను ప్రశ్నిస్తూ కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
కొల్లాపూర్/ అచ్చంపేటటౌన్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి 1000 రోజులు గడుస్తున్నా ప్రజలకి చ్చిన 420 హామీలను అమలు చేయడంలో పూ ర్తిగా విఫలమైందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. అవినీతి, స్కామ్‌లతో రాష్ట్రాన్ని దగా చేస్తోందని ఆయన మండిపడ్డారు. బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు 420 మీటర్ల బ్యానర్‌పై కాంగ్రెస్ పాలనను ప్రశ్ని స్తూ కొల్లాపూర్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహిం చారు. ఎన్టీఆర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్ 100 రోజుల్లో పూర్తి చేస్తామన్న పథకాలనే 1000 రోజులైనా అమలు చేయలేకపోయిందని దుయ్య బట్టారు. వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ తీవ్రం గా దెబ్బతీసిందని, ఉచిత విద్యుత్ సరిగా అంద క, రుణమాఫీ పూర్తికాక, రైతు భరోసా, రైతు బీ మా, యూరియా కొరతతో రైతులు దిక్కుతో చని స్థితిలో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇ చ్చిన బాకీ కార్డులను ప ట్టుకుని ప్రతీ మండలంలో గ్రామ గ్రామాన పర్యటి స్తామని ఆయన తెలిపారు. కార్యక్ర మంలో కొల్లాపూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ప్ర జాప్రతినిధులు, ముఖ్య నా యకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మోసపూరిత హామీలతో అధికారం
- బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్ భీమా
అచ్చంపేటటౌన్, (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ పార్టీ 420 రకాల మోసపూరిత హామీలతో ప్ర జలకు ఆశచూపి అధికారంలోకి వచ్చిందని బీ ఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్ భీమా అ న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల వైఫల్య పాలనపై పట్టణంలో 420 హామీలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీతో ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మనోహర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. హామీ లు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైం దన్నారు. రాష్ట్రంలో నేరాల రేటు 7.15శాతం పె రిగిందని, హోంమంత్రి లేకపోవడంతో శాంతి భ ద్రతలు మంటగలిశాయని ఆరోపించారు. కార్య క్రమంలో మాజీ మునిసిపల్ చైర్మన్లు నరసిం హ్మగౌడ్, తులసీరాం, నాయకులు అంతటి శివ, పర్వ తాలు, ఖలీల్, భాస్కర్ పాల్గొన్నారు.