హమీల అమలులో కాంగ్రెస్ విఫలం
ABN , Publish Date - Aug 30 , 2026 | 11:49 PM
ఎన్ని కల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చే యడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫం అయ్యిందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే న డిపల్లి దివాకర్‌రావు అన్నారు.
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు
లక్షెట్టిపేట, ఆగస్టు 30(ఆంద్రజ్యోతి): ఎన్ని కల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చే యడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫం అయ్యిందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే న డిపల్లి దివాకర్‌రావు అన్నారు. ఆదివారం లక్షె ట్టిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావే శంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో 420హామీలు ఇచ్చి గద్దె నెక్కిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు అ మలు చేయకుండా ప్రజలను మోసం చేశాడన్నారు. హామీల అమలు కోరుతూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలు చే స్తామన్నారు. సెప్టెంబర్ 2న మొదటి రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరగబోయే ని రసన కార్యక్రమానికి రెండు మండలాల నుం చినాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో పార్టీ మండల అద్యక్షుడు చుంచు చిన్నయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పో డేటి శ్రీనివాస్‌గౌడ్, మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగన్న, కౌన్సిలర్లు పెట్టెం తిరుపతి, రాందేని జమున, నాయకులు చాంద్ పాష, దండేపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ పసర్తి అనీల్, నాయులు చుంచు శ్రీనివాస్, రా జమల్లు, గోళ్ల రవీందర్, శ్రీనివాస్, గరిసె రవీం దర్, గడికొప్పుల సతీష్, అక్కల రవీందర్ పాల్గొన్నారు.