Share News

ఇళ్ల కేటాయింపులో కాంగ్రెస్‌ విఫలం

ABN , Publish Date - Sep 27 , 2026 | 11:36 PM

నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కేటాయించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా వి ఫలమైందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆరోపిం చారు.

ఇళ్ల కేటాయింపులో కాంగ్రెస్‌ విఫలం

మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కేటాయించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా వి ఫలమైందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆరోపిం చారు. ఆదివారం ఆయన తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. బీ ఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 650కి పైగా ఇండ్లను మంజూరు చేసి లబ్ధి దారుల ఎంపికను పూర్తి పారదర్శకతతో కలెక్టర్‌ ఆధ్వర్యంలో డ్రా పద్ధతిన ఎంపిక చేశామని, లబ్దిదారులకు ఇండ్లు కేటాయించేలోగానే ప్రభుత్వం మా రిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కేటాయింపులో ఎందుకు ఆలస్యం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా మంచిర్యాల నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని, లేనిపక్షంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందో ళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు సుబ్బన్న, సత్యం, రవీందర్‌రెడ్డి, అబ్దుల్‌ సత్తార్‌, నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2026 | 11:36 PM