మహిళా సాధికారతకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
ABN , Publish Date - Mar 09 , 2026 | 03:46 AM
మహిళా సాధికారతకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు ....
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారతకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందుకున్న పలువురు మహిళలను ఆయన అభినందించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నప్పుడే సమాజం అగ్రభాగాన నిలుస్తుందని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.