Share News

అన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ భవనాల నిర్మాణం

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:20 AM

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీకి సొంత భవనాలు నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించామని పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌ తెలిపారు.

అన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ భవనాల నిర్మాణం

  • ఎన్నికలు ఎప్పుడొచ్చినా హస్తానిదే అధికారం

  • పీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌, మంత్రి సీతక్క

నిజామాబాద్‌ ప్రతినిధి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీకి సొంత భవనాలు నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించామని పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌ తెలిపారు. బుధవారం నిజామాబాద్‌ నగరంలో భూమి పూజకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ భవన నిర్మాణం పూర్తయ్యాక రాహుల్‌గాంధీ ప్రారంభిస్తారని తెలిపారు. కాంగ్రెస్‌లో కులమతాలు లేవన్నారు. ప్రధానమంత్రి పదవి అందివచ్చినా సోనియా, రాహుల్‌ స్వీకరించలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ త్యాగాలకు చిరునామా అన్నారు. దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ కేవలం 4-10 సీట్లకు పరిమితం అవుతుందన్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ఆశల పల్లకిలో కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడాదిన్నరలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి, నగర మేయర్‌ ఉమారాణి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 05:20 AM