Share News

కేటీఆర్‌, రోహిత్‌రెడ్డి దిష్టిబొమ్మల దహనం

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:22 AM

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, ఎన్‌ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌ల ఆధ్వర్యంలో గాంధీభవన్‌ ఎదుట కాంగ్రెస్‌, ఎన్‌ఎస్యూఐ కార్యకర్తలు..

కేటీఆర్‌, రోహిత్‌రెడ్డి దిష్టిబొమ్మల దహనం

హైదరాబాద్‌, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, ఎన్‌ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌ల ఆధ్వర్యంలో గాంధీభవన్‌ ఎదుట కాంగ్రెస్‌, ఎన్‌ఎస్యూఐ కార్యకర్తలు.. కేటీఆర్‌, పైలెట్‌ రోహిత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అసెంబ్లీలో డ్రగ్స్‌ టెస్టింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలంటూ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిలకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్‌ పట్ల ప్రజల్లో చైతన్యం తేవడానికి, వారికి ఒక సందేశం ఇవ్వడానికి అసెంబ్లీలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. పైలెట్‌ రోహిత్‌రెడ్డి డ్రగ్స్‌ పార్టీ వ్యవహారంపై కేటీఆర్‌ వివరణ ఇవ్వాలని చనగాని దయాకర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 16 , 2026 | 04:22 AM