kumaram bheem asifabad- జిల్లా స్థాయి సమావేశంలో గందరగోళం
ABN , Publish Date - May 22 , 2026 | 10:10 PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిలో బాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డేవిడ్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా స్థాయి అధికారులతో పాటు జిల్లాలోని అన్ని పంచాయతీల సర్పంచ్‌లు, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
వాకౌట్ చేసి నిరసన
ఆసిఫాబాద్‌రూరల్, మే 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిలో బాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డేవిడ్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా స్థాయి అధికారులతో పాటు జిల్లాలోని అన్ని పంచాయతీల సర్పంచ్‌లు, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొదటగా జిల్లా అధికారులు అరకొర కొద్ది సేపు మాట్లాడిన అనంతరం సర్పంచ్‌లు గ్రామాల్లో ఉన్న సమస్యల గురించి జిల్లా స్థాయి అధికారులకు విజ్ఞప్తి చేయడానికి కూడా కనీసం సమయం ఇవ్వకో పోగా గౌరవ సర్పంచ్‌లను అవమానించే దోరణితో వ్యవహరించి మైక్ కట్ చేసి సర్పంచ్‌ల నోరు మూసే విధంగా అవమాన పరిచినందు గాను సర్పంచ్‌లు సమావేశ గది నుంచి వాకౌట్ చేసి కలెక్టట్ కార్యాలయం ఆవరణలో ఈ సందర్భంగా డబ్బా గ్రామ సర్పంచ్ సంతోష్ మాట్లాడుతూ సర్పంచ్‌లు ఎన్నికై అయిదు నెలలు పూర్తి అవుతున్నా గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఏ విధంగా కూడా ఒక్క రూపాయి నిధులను గ్రామ పంచాయతీలకు జమ చేయక పోగా కేంద్ర ప్రభుత్వం జమ చేసినటువంటి పదిహేను ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్‌లకు టైడ్ అండ్ అటైడ్ గ్రాంట్స్ సాకుతో ఏ ఆక్టివిటీ విభాగంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో ఉంటే అందులో నుంచి బిల్లులు చేసుకోవాలని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నందుకు అదే విధంగా అయిదు నెలలు గడుస్తున్నా కనీసం సర్పంచ్‌లకు గౌరవ వేతనం కూడా ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. అధికారులు సర్పంచ్‌లకు కనీస గౌరవం లేకుండా వివక్షతోవ్యవహరిస్తున్నారని వాపోయారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు మళ్లీ ఏర్పడితే రాబోయే స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సర్పంచ్‌ల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. సర్పంచ్‌లకు న్యాయపరమైన డిమాండ్‌లను వెంటనే నెరవేర్చకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు. నిరసన కార్యక్రమంలో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల, స్వతంత్ర సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్ ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.