kumaram bheem asifabad- శోభాయాత్ర నిర్వహించి.. నిమజ్జనం చేసి..
ABN , Publish Date - Sep 20 , 2026 | 10:21 PM
కెరమెరి, పెంచికల్‌పేట్ మండలాల్లో పలు చోట్ల ఆదివారం గణేశ్ శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం చేశారు. కెరమెరి కెలి(బి)లో వినాయక నిమజ్జన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు
కెరమెరి/పెంచికల్‌పేట్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కెరమెరి, పెంచికల్‌పేట్ మండలాల్లో పలు చోట్ల ఆదివారం గణేశ్ శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం చేశారు. కెరమెరి కెలి(బి)లో వినాయక నిమజ్జన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగ్‌నాథ్, గ్రామస్థులు నారాయణ, వినేష్ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పెంచికల్‌పేట్ మండల కేంద్రంలో గణేశ్ నిమజ్జన వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. మండల కేంద్రంలోని సంజీవ్‌నగర్ కాలనీలో స్థానిక చిన్నారులు భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేసిన గణనాథుడికి కాలనీ వాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన శోభాయాత్రలో చిన్నారులతో పాటు భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంగళవాయిద్యాలు, కోలాటల నడుమ గణేశుడిని ఊరేగిస్తూ సమీపంలోని పెద్దవాగుకు తరలించి నిమజ్జనం చేశారు.