kumaram bheem asifabad- తనిఖీ చేసి.. నేరాల వివరాలు తెలుసుకుని..
ABN , Publish Date - Oct 15 , 2026 | 10:28 PM
జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయాన్ని కాళేశ్వరం మల్టీజోన్-1 డీఐజీ అంబర్ కిషోర్ ఝా గురువారం తనిఖీ చేసి, నేరాల వివరాలు తెలుసుకుని సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ క్రైం రికార్డ్స్ బ్యూరో విభాగాన్ని తనిఖీ చేసి నేరాల రికార్డులు, కేసుల వివరాలు, నేరస్తుల డేటా, పెండింగ్ కేసులకు సంబందించిన రికార్డులు, రిజిష్టర్లు, ఫైళ్ల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుశాఖలో సమర్థవంతమైన పనితీరును కచ్చితమైన రికార్డుల నిర్వహణ ఎంతో కీలకమని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ కేసులు నేరాలకు సంబందించిన సమాచారాన్ని, డేటానిర్వహణ, రికార్డుల నవీకరణలో నాణ్యత కచ్చితత్వాన్ని పాటించాలని సూచించారు
ఆసిఫాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయాన్ని కాళేశ్వరం మల్టీజోన్-1 డీఐజీ అంబర్ కిషోర్ ఝా గురువారం తనిఖీ చేసి, నేరాల వివరాలు తెలుసుకుని సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ క్రైం రికార్డ్స్ బ్యూరో విభాగాన్ని తనిఖీ చేసి నేరాల రికార్డులు, కేసుల వివరాలు, నేరస్తుల డేటా, పెండింగ్ కేసులకు సంబందించిన రికార్డులు, రిజిష్టర్లు, ఫైళ్ల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుశాఖలో సమర్థవంతమైన పనితీరును కచ్చితమైన రికార్డుల నిర్వహణ ఎంతో కీలకమని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ కేసులు నేరాలకు సంబందించిన సమాచారాన్ని, డేటానిర్వహణ, రికార్డుల నవీకరణలో నాణ్యత కచ్చితత్వాన్ని పాటించాలని సూచించారు. రికార్డులను క్రమబద్ధంగా నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు నవీకరించి భద్రపరచాలని అధికారులను ఆదేశించారు. కేసులు, నేరాలకు సంబంధించిన సమా చారాన్ని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలని చెప్పారు. అవసరమైనప్పుడు తక్షణమే అందుబాటులో ఉండాలని డేటాను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. పెండింగ్ రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బందికి అప్పగించిన విదులను బాధ్యతయుతంగా సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం ఉచిత పోలీసు నియామక శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్న 160 మంది అభ్యర్థులతో మాట్లాడారు. వారి శిక్షణ సన్నద్దతకు సంబందించిన వివరాలను తెలుసు కున్నారు. అభ్యర్థులు శిక్షణను సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. అంతకు ముందు పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ఎస్పీ నితికాపంత్, ఏఎస్పీ చిత్తరంజన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సతీష్, సీఐలు, ఎస్సైలు, ఆర్ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.