Share News

బీర్‌ బాటిల్‌లో కండోమ్‌ ప్యాకెట్‌!

ABN , Publish Date - May 20 , 2026 | 03:55 AM

సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లిలోని ఓ వైన్స్‌ షాపులో కొనుగోలు చేసిన ఓ బీర్‌ సీసాలో నిరోధ్‌ ప్యాకెట్‌ కనిపించడంతో మంగళవారం కలకలం రేగింది.

బీర్‌ బాటిల్‌లో కండోమ్‌ ప్యాకెట్‌!

  • వైన్స్‌ షాపు వద్ద వినియోగదారుల ఆందోళన

  • సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లిలో ఘటన

మిరుదొడ్డి, మే 19 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లిలోని ఓ వైన్స్‌ షాపులో కొనుగోలు చేసిన ఓ బీర్‌ సీసాలో నిరోధ్‌ ప్యాకెట్‌ కనిపించడంతో మంగళవారం కలకలం రేగింది. బీర్‌ సీసాను కొనుగోలు చేసిన ఓ వినియోగదారుడు దాన్ని తాగబోగా అందులో కండోమ్‌ ప్యాకెట్‌ను గమనించి ఒక్కసారిగా కంగుతిన్నాడు. గతంలో ఓసారి ఇదే వైన్స్‌ షాపులో బీర్‌ను కొనుగోలు చేయగా.. అందులో కేవలం నీరు మాత్రమే ఉందని ఆ వినియోగదారుడు తెలిపాడు. ఈ షాపులో కల్తీ మద్యం విక్రయాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అక్కడనున్న వినియోగదారులంతా కలిసి వైన్స్‌ షాపు నిర్వాహకులను ప్రశ్నించగా.. తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో వారంతా అక్కడే ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ ఎస్సై సరిత ఘటనాస్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వినియోగదారుడి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సరిత తెలిపారు.

Updated Date - May 20 , 2026 | 03:55 AM