ప్రముఖుల పరామర్శ
ABN , Publish Date - Sep 23 , 2026 | 11:27 PM
కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఇటీవల హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి బీరం లక్ష్మారెడ్డి పరమపదించిన విషయం తెలిసిందే.
- బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన హరీశ్‌రావు
కొల్లాపూర్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఇటీవల హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి బీరం లక్ష్మారెడ్డి పరమపదించిన విషయం తెలిసిందే. ఈ క్ర మంలో బుధవారం కొల్లాపూర్ మండలం సింగో టం గ్రామంలోని బీరం హర్షవర్ధన్‌రెడ్డి వ్యవసా య క్షేత్రానికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు తన్నీరు హరీశ్‌రావు చేరుకున్నారు. ఆయనతో పాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకుని దివంగ త బీరం లక్ష్మారెడ్డి చిత్రపటా నికి పూలమాలలు వేసి ఘ న నివాళులర్పించారు. అ నంతరం బీరం హర్షవర్ధన్ రెడ్డిని, వారి కుటుంబ స భ్యులను పరామర్శించిన హరీశ్‌రావు, తమ ప్రగాఢ సానుభూతిని తెలి యజేశారు. లక్ష్మారెడ్డి ఆత్మ కు శాంతి చేకూరాలని ఆ కాంక్షిస్తూ, ఎంతటి కష్ట సమ యంలోనైనా పార్టీ కుటుంబంలా అండగా ఉం టుందని ధైర్యం చెప్పారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి వ్యవ సాయ క్షేత్రంలో భోజనాలు చేశారు. ఆ తరువాత వారు అక్కడి నుంచి తిరుగు ప్ర యాణమయ్యారు. బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నా యకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వ్యవ సాయ క్షేత్రానికి చేరుకొని, హరీశ్‌రావును కలి సేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.కార్యకర్తలను కలుస్తూ అభివాదం చేస్తూ హరీశ్‌రావు కార్యక్రమాన్ని ముగించుకు న్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, డాక్టర్ పి లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.