kumaram bheem asifabad-అధ్వాన రోడ్లతో అవస్థలు
ABN , Publish Date - Mar 03 , 2026 | 10:32 PM
మండలంలోని పలు గ్రామాల్లో మట్టి రోడ్లతో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు. అనాధిగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న ప్రజలపై ప్రజాప్రతినిధులు, అధికారులు కరుణించడం లేదు. దీంతో ప్రయాణినికి అష్ట కష్టాలు పడుతున్నారు.
- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
కెరమెరి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో మట్టి రోడ్లతో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు. అనాధిగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న ప్రజలపై ప్రజాప్రతినిధులు, అధికారులు కరుణించడం లేదు. దీంతో ప్రయాణినికి అష్ట కష్టాలు పడుతున్నారు. మండలంలోని నిషాని గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలతో పాటు ఇతర 15 గ్రామాల ప్రజలు రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిషాని గ్రామ పంచాయతీలో సుమారు 420 కుటుంబాలు ఉండగా 1,234 జనాభా ఉంది. నిషాని, గోండ్‌గూడ, మారెగూడ, పర్దాన్‌గూడ, బెస్తగూడ గ్రామా లు ఉన్నాయి. కుమరం భీం ప్రాజెక్టులో కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కెరమెరి నుంచి నిషానికి వెళ్లాలంటే ఉమ్రి, ఇందాపూర్, మీదుగా వెళ్లాల్సి ఉంది. సమీపంలోని పునరావాసం కల్పించారు. పునరావాసం కాలనీ వరకు సదరు కాంట్రాక్టర్ బీటీ రోడ్డు వేసినప్పటికీ మిగితా రెండు కిలో మీటర్ల రోడ్డు సరిగ్గా లేక నరకం చూపిస్తుంది. రాళ్లు, రప్పలు తేలి నడిచేందుకు యోగ్యంగా లేదు. ఇప్పుడు ఎలాగోలా నడవ గలుగుతున్నా వానాకాలంలో మాత్రం మోకాళ్ల లోతు బురద నిండి రాక పోకలు నిలిచి పోతున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆసిఫాబాద్ మీదుగా కెరమరికి రావాల్సి వస్తుంది. దీంతో 25 కిలో మీటర్లకు బదులుగా 50 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆగుర్‌వాడ గ్రామం నుంచి ఉమ్రికి వెళ్లే దారి పూర్తిగా కచ్చా రోడ్డుగా ఉంది. అటవీ శాఖ అనుమతులు లేక పోవడంతో అధికారులు గతంలో ఈ రోడ్డు నిర్మాణం నిలిచి వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకునే నాథుడు లేక పోయారు. అధికారులు స్పందించి రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం..
- అంబారావు, సర్పంచ్, నిశాని
సమస్యను ఇటీవల బాధ్యతలు చేపట్టాన కలెక్టర్ హరిత దృష్టికి తీసుకెళ్తాం. ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. గతంలో ఉన్న సర్పంచ్‌లు, మండల నాయకులు అధికారుల దృష్టికి తీసేకెళ్లినా స్పందన లేదు. అటవీ అధికారులతో కూడా మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరుతాం.