kumaram bheem asifabad- దిగుబడిపై దిగులు
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:05 PM
యాసంగిలో వరి సాగు చేసిన రైతులకు దిగుబడిపై దిగులు పట్టుకున్నది. అన్నదాతలకు వరి సాగు చేసిన రైతాంగానికి పంట గొలుసు దశలో తెల్లకంకి తెగుళ్లు సోకడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 15 మండలాల పరిధిలో 23 వేల ఎకరాలపైగా రైతులు విత్తన వరి, సన్న, దొడ్డు రకాలు వరి పంటను రైతులు సాగు చేశారు. వేసినప్పటి నుంచి వరి పైరు బాగా ఎదిగినప్పటికీ పంటను చూసిన రైతలు సంతోషించారు. వరి కంకులు బయటకు వెళ్తున్న సమయంలో వరి పంటపై కాండం తొలుచు పురుగు ఆశించింది. దీంతో వరి కంకులు తెల్లగా మారిపోతుండడంతో రైతులు ఆందోళన చెం దుతున్నారు
దహెగాం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): యాసంగిలో వరి సాగు చేసిన రైతులకు దిగుబడిపై దిగులు పట్టుకున్నది. అన్నదాతలకు వరి సాగు చేసిన రైతాంగానికి పంట గొలుసు దశలో తెల్లకంకి తెగుళ్లు సోకడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 15 మండలాల పరిధిలో 23 వేల ఎకరాలపైగా రైతులు విత్తన వరి, సన్న, దొడ్డు రకాలు వరి పంటను రైతులు సాగు చేశారు. వేసినప్పటి నుంచి వరి పైరు బాగా ఎదిగినప్పటికీ పంటను చూసిన రైతలు సంతోషించారు. వరి కంకులు బయటకు వెళ్తున్న సమయంలో వరి పంటపై కాండం తొలుచు పురుగు ఆశించింది. దీంతో వరి కంకులు తెల్లగా మారిపోతుండడంతో రైతులు ఆందోళన చెం దుతున్నారు. కష్టమంతా వృథాగా పోతుందని, దిగుబడి తగ్గుతుందని రైతులు చెబుతున్నారు.
ఎకరానికి రూ. 26 వేలు..
వరి పంట సాగుకు ఎకరానికి రూ.26 వేల నుంచి రూ.30 వేల పెట్టుబడి అవుతుంది. నారు పోసిన దశ నుంచి పురుగు మందులు, ఎరువుల ఖర్చు ఉంటుంది. మూడు సార్లు ఎరువులు, మూడు సార్లు పురుగుల మందు స్ర్పే చేయాల్సి ఉంటుంది. అయితే వరి పంటకు కాండం తొలిచే పురుగు ఆశించడంతో పంట దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పలుమార్లు పురుగుల మందు పిచికారి చేసినా ఉధృతి తగ్గలేదని రైతులు ఆవేదన చెబుతున్నారు. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సూచనలు ఇచ్చిన పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.
నాలుగు ఎకరాల్లో వరి..
- రామయ్య, పీలకగుండం, రైతు
నాలుగు ఎకరాల్లో దొడ్డు రకం వరి సాగు చేశాను. ఆరంభంలో వరి పైరు బాగా ఎదుగదల వచ్చింది. కాండం తొలుచు పురుగు ఆశించడంతో కంకులు తెల్లబడి పోయాయి. కంకులు తెల్లబడి పంట దిగుబడి తగ్గుతుంది. వ్యవసాయాధికారులు పర్యటించి సలహాలు ఇవ్వాలి.
దిగుబడి పడిపోయే ప్రమాదం..
- చప్పిడి బక్కయ్య, పీఏసీఎస్ సీఈవో
తెగుళ్లతో వరి దిగుబడి పడిపోయే ప్రమాదం నెలకొన్నది. ఐదెకరాల్లో వరి పంట సాగు చేశాను. ప్రారంభంలో పంట బాగా వచ్చింది. కాండలు బయటకు వెళ్తున్న దశలో తెల్లకం కు లు వచ్చాయి. స్ర్పేలు చేసినా, గుళికలు చల్లినా పురుగు తగ్గక పోగా తెల్లకంకులు వస్తున్నాయి.