Share News

యోగా సాధనతో ఏకాగ్రత

ABN , Publish Date - Jun 21 , 2026 | 11:51 PM

అం తర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని, ఆదివారం జి ల్లాలో యోగాసనాలు నిర్వహించారు.

యోగా సాధనతో ఏకాగ్రత
నాగర్‌కర్నూల్‌ కోర్టు ఆవరణలో యోగాసనాలు

- జిల్లా కోర్టు న్యాయాధికారి డి.రమాకాంత్‌

- ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

కందనూలు/ అచ్చంపేటటౌన్‌/ కల్వకుర్తి/ కొల్లాపూర్‌/ తా డూరు/తిమ్మాజిపేట/ ఉప్పునుంతల/ అమ్రాబాద్‌/ మన్ననూ ర్‌/ పదర/ కోడేరు/ లింగాల, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి) : అం తర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని, ఆదివారం జి ల్లాలో యోగాసనాలు నిర్వహించారు. జిల్లా కోర్టులో న్యాయాధి కారి డి.రమాకాంత్‌ ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. ఆయ న మాట్లాడుతూ నిత్యజీవితంలో యోగాను సాధన చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. రోగనిరోధక శక్తి బల పడి దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉంటాయని పేర్కొన్నారు. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలకు యోగా వల్ల దూరమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రవి కాంతారావు, గురువు గోపాల్‌రెడ్డి, న్యాయవాదులు, జూని యర్‌ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 11:51 PM