Share News

హేతువాద పత్రిక సంపాదకుడు క్రాంతికార్‌ కన్నుమూత

ABN , Publish Date - May 28 , 2026 | 03:34 AM

విప్లవ రచయితల సంఘం (విరసం) తొలితరం నేత, హేతువాద సంఘం మాజీ రాష్ట్ర నేత, హేతువాద పత్రిక సంపాదకులు కామ్రేడ్‌ క్రాంతికార్‌ బుధవారం...

హేతువాద పత్రిక సంపాదకుడు క్రాంతికార్‌ కన్నుమూత

  • గద్దర్‌కు ఆ పేరు పెట్టింది ఆయనే..

ఖమ్మంఖానాపురంహవేలి, మే 27(ఆంధ్రజ్యోతి): విప్లవ రచయితల సంఘం (విరసం) తొలితరం నేత, హేతువాద సంఘం మాజీ రాష్ట్ర నేత, హేతువాద పత్రిక సంపాదకులు కామ్రేడ్‌ క్రాంతికార్‌ బుధవారం(86) రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. హోమియోపతి డాక్టర్‌ అయిన క్రాంతికార్‌.. తన వృత్తిని కొనసాగిస్తూనే అనేక సాహితీ పత్రికలు నడిపారు. ఖమ్మంలో విరసం మొదటి మహాసభను విజయవంతంగా నిర్వహించిన ప్రముఖుల్లో ఆయన ఒకరు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లిలో జన్మించిన మచ్చ లక్ష్మయ్య.. క్రాంతికార్‌ పేరుతో విప్లవోద్యమంలో నక్సలైట్‌గా అజ్ఞాతవాసం, రహస్య ఉద్యమం చేశారు. నక్సలైట్‌ ఉద్యమం నుంచి బయటికి వచ్చి హేతువాద ఉద్యమ నిర్మాణం కోసం కృషి చేసిన ఆయన హేతువాదం అనే పత్రికకు ప్రస్తుతం ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దివంగత గద్దర్‌కు గద్దర్‌ పేరు పెట్టింది కూడా క్రాంతి కార్‌ అనేది చాలా మందికి తెలియదు. క్రాంతికార్‌కు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. క్రాంతికార్‌ మృతి పట్ల బీవీ రాఘవులు సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. గురువారం ఉదయం అంతిమయాత్ర అనంతరం క్రాంతికార్‌ భౌతికకాయాన్ని ఖమ్మం మెడికల్‌ కళాశాలకు అందజేయనున్నారు.

Updated Date - May 28 , 2026 | 03:34 AM