Share News

ఓటరు జాబితా సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - May 16 , 2026 | 11:41 PM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం హైద్రాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌తో సమావేశం నిర్వహించారు.

ఓటరు జాబితా సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 16 (ఆంధ్రజ్యోతి) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం హైద్రాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర కార్యక్రమం అమలు చేయడానికి కార్యచరణ విడుదల చేసిందన్నారు. ఇందులో భాగంగా జూన్‌ 15 నుంచి 24 వరకు సంబంధిత సిబ్బందికి, అధికారులకు శిక్షణ, ఎన్యుమరేషన్‌ ఫారం ప్రింటింగ్‌ తదితర ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. జూన్‌ 25 నుంచి జులై 24 వరకు బూత్‌స్థాయి అధికారులకు ఎన్యుమరేషన్‌ ఫారాలు ప్రతి ఇంటికి అందజేయడం, ఫారం పూర్తి చేసిన తర్వాత తిరిగి తీసుకోవాలన్నారు. జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, అక్టోబర్‌ 1న తుది ఓటరు జాబితా ప్రచురణ ఉంటుందన్నారు. ఫారం 6, 7, 8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. మీడియా, సోసల్‌ మీడియా ద్వారా వచ్చే ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించాలని, తప్పుడు ప్రచారాన్ని నిరోధించాలన్నారు. జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిల్లాలో మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంపై అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్‌లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2026 | 11:41 PM