విద్యతోనే సమగ్ర అభివృద్ధి
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:03 PM
దివాసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే విద్యతోనే సాధ్యమని ట్రైబల్ వెల్ఫేర్ నేషనల్ హ్యుమన్ రైట్స్ మానిటరింగ్ సభ్యుడు హేమంత్‌కుమార్ అన్నారు. మండలంలోని రౌటసంకెపల్లి, పాతరౌట గ్రామాలతో పాటు జిల్లా కేంద్రంలోని బాలికల క్రీడా పాఠశాలను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా పాతరౌట గ్రామంలోని కుమరం భీం, ఎడ్లకొండు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే విద్యతోనే సాధ్యమని ట్రైబల్ వెల్ఫేర్ నేషనల్ హ్యుమన్ రైట్స్ మానిటరింగ్ సభ్యుడు హేమంత్‌కుమార్ అన్నారు. మండలంలోని రౌటసంకెపల్లి, పాతరౌట గ్రామాలతో పాటు జిల్లా కేంద్రంలోని బాలికల క్రీడా పాఠశాలను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా పాతరౌట గ్రామంలోని కుమరం భీం, ఎడ్లకొండు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రౌటసంకెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ సమాజ అభివృద్ధికి విద్యే ఆయుధమని చెప్పారు. ప్రతీ గిరిజన విద్యార్థి నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకునేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. విద్య ద్వారానే సామాజిక, ఆర్థిక సాధికారత సాధ్యమవుతుందని వివరించారు.
ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఆదివాసీలకు అమలవుతున్న సంక్షేమ పథకాలు, విద్యా కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలను సందర్శించారు. వారికి అందుతున్న సౌకర్యాలు, విద్యాభ్యాసం, వసతి, క్రీడా సౌకర్యాలపై ఆరాతీశారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోను రాణించి ఉన్నతలక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ, ఏపీవో వసంత్‌రావు, ఓఎస్డీ గంగాధర్, తహసీల్దార్ రియాజ్‌అలీ, ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో కొట్నాక శకుంతల, ఏటీడీవోలు చిరంజీవి, భాస్కర్, ఎస్సీఆర్పీలు రవిందర్, అనంత్, సర్పంచ్ కొండు తదితరులు పాల్గొన్నారు.