Share News

కల్వకుర్తి పట్టణ సమగ్ర అభివృద్ధే ఎజెండా

ABN , Publish Date - Sep 26 , 2026 | 11:39 PM

క ల్వకుర్తి పట్టణ సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బృంగి రత్న మాల అన్నారు.

కల్వకుర్తి పట్టణ సమగ్ర అభివృద్ధే ఎజెండా
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బృంగి రత్నమాల

- మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బృంగి రత్నమాల

కల్వకుర్తి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : క ల్వకుర్తి పట్టణ సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బృంగి రత్న మాల అన్నారు. ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రె డ్డి సహకారంతో పట్టణంలో సుమారు రూ.120 కోట్లతో వివిధ అభివృద్ది పనులు కొనసాగుతు న్నాయని తెలిపారు. ప్రజలకు మౌలిక వసతు లు కల్పించడంతో పాటు పాలనను ప్రజల ముంగిటకు తీసుకెళ్లేలా చర్యలు చేపడుతున్నా మని చెప్పారు. ఇందులో భాగంగా అక్టోబరు 2 నుంచి పట్టణంలోని 22వార్డులకు వార్డు ఆఫీస్‌ లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలి పారు. శనివారం కల్వకుర్తి మునిసిపల్‌ కార్యాల యంలో వైస్‌ చైర్మన్‌ షానవాజ్‌ఖాన్‌తో ముని సిపల్‌ చైర్‌పర్సన్‌ బృంగి రత్నమాల విలేకర్ల స మావేశంలో మాట్లాడారు. అక్టోబరు 2న ముని సిపల్‌ కార్యాలయంలో మహాత్మాగాంధీ విగ్రహా న్ని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ డాక్టర్‌ మల్లురవిల చేతుల మీదుగా ఆవిష్క రించనున్నట్లు పేర్కొన్నారు. కొంతమంది రాజకీ య దురుద్దేశంతో బీసీ మహిళకు మంచి పేరు వస్తుందని జీర్ణించుకోలేక ఆరోపణలు చేస్తున్నా రని విమర్శించారు. తాను అవినీతికి పాల్పడి నట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. విలేకర్ల సమావేశంలో మార్కె ట్‌ కమిటీ డైరెక్టర్‌ పసుల రమాకాంత్‌రెడ్డి, కౌన్సిలర్‌ రాజేశ్‌కుమార్‌, నాయకులు చిత్తారి శ్రీనివాసులు, హనుమనాయక్‌, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 11:39 PM