ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:41 PM
ప్రజావాణిలో వచ్చిన ఫి ర్యాదులను ఎప్పటికప్పు డు పరిష్కరించాలని అద నపు కలెక్టర్లు దేవ సహా యం, చెన్నయ్యలు అధికా రులను ఆదేశించారు.
- అదనపు కలెక్టర్లు బి.చెన్నయ్య, దేవ సహాయం
నాగర్‌కర్నూల్, అక్టోబ రు 12 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణిలో వచ్చిన ఫి ర్యాదులను ఎప్పటికప్పు డు పరిష్కరించాలని అద నపు కలెక్టర్లు దేవ సహా యం, చెన్నయ్యలు అధికా రులను ఆదేశించారు. సో మవారం కలెక్టరేట్‌లో ని ర్వహించిన ప్రజావాణిలో జి ల్లా నలుమూలల నుంచి వ చ్చిన ప్రజలు తమ సమస్యలపై అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులకు వినతిపత్రం అం దజేసి పరిష్కరించాలని కోరారు. ఈ ప్రజావా ణిలో 46 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని సంబం ధిత జిల్లా అధికారులకు అందించి సకాలంలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు ఆదేశించా రు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పాండు, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, వివిధ విభాగాల సూప రింటెండెంట్లు జిల్లా అధికా రులు పాల్గొన్నారు.