Share News

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - Mar 16 , 2026 | 11:25 PM

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా సత్వరం పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ జీ.వీ.శ్యాంప్రసాద్‌లాల్‌ అధికారులను ఆ దేశించారు.

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
ఫిర్యాదులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ జీ.వీ.శ్యాంప్రసాద్‌లాల్‌

- అదనపు కలెక్టర్‌ జీ.వీ.శ్యాంప్రసాద్‌లాల్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మార్చి 16 (ఆంధ్రజ్యో తి) :ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా సత్వరం పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ జీ.వీ.శ్యాంప్రసాద్‌లాల్‌ అధికారులను ఆ దేశించారు. సోమవారం కలెక్టరేట్‌ ప్రజావాణిలో కలెక్టరేట్‌ పరిపాలనాధికారి చంద్రశేఖర్‌తో కలిసి ఆయన వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చి న ఫిర్యాదులను స్వీకరించారు. ఈ వారం కలెక్ట రేట్‌ ప్రజావాణికి మొత్తం 44 ఫిర్యాదులు వ చ్చాయి. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాస మస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారు లపై ఉందన్నారు. జిల్లా స్థాయి సమస్యలను తక్షణ మే పరిష్కరించడంతో పా టు క్షేత్రస్థాయి వాటిని సంబంధిత మండలాలకు బదిలీ చేసి పరిష్కారమ య్యేదాక పర్యవేక్షించాల న్నారు. వివిధ శాఖల జి ల్లా అధికారులు, అధికారు లు పాల్గొన్నారు.

పోలీసు ప్రజావాణికి 11 ఫిర్యాదులు

నాగర్‌కర్నూల్‌, (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు ప్రజావాణికి ఈ వారం మొత్తం 11 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌ స్వీక రించి ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి పరిష్కారానికి హామీ ఇచ్చారు.

Updated Date - Mar 16 , 2026 | 11:25 PM