ఫిర్యాదులను వెంటవెంటనే పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:56 AM
ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదులను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ అదేశిం చారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమా వేశమందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావా ణికి జిల్లా నలుమూల నుంచి ప్రజలు
సిరిసిల్ల అర్బన్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదులను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ అదేశిం చారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమా వేశమందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావా ణికి జిల్లా నలుమూల నుంచి ప్రజలు తరలి రావడంతో కలెక్టరేట్ కిటకిటలాడింది. కలెక్టరేట్‌లో ప్రజావాణికి వచ్చిన ప్రజలందరూ తమ ఫిర్యాదులను అన్‌లైన్ చేసుకుని సమావేశ మందిరంలో నిర్వహిం చిన ప్రజావాణిలోకి వచ్చిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్‌తో పాటు అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా అధికారులను కలిసి సమస్యలను విన్నవించి ఫిర్యాదులను అందించారు. ఈ ప్రజావాణిలో 218 ఫిర్యాదుల వచ్చాయి. వీటి సంబంధిత జిల్లా అధికా రులకు అందించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ అదేశించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులను ఎన్ని పరిష్కరించారనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను అన్‌లైన్‌లో పరిష్కరించాలని పెండింగ్‌లో పెట్టవద్దని అదేశించారు. అన్నిశాఖల అధికారులు బాధ్యులు తప్పనిసరిగా ప్రజావాణికి హాజరుకావాలని స్పష్టం చేశారు.ప్రజావాణిలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, వేములవాడ అర్డీవో రాధాబాయ్ పాల్గొన్నారు.
ఫ మొర్రాయిపల్లెలో తాగునీటి ఎద్దడిని తీర్చాలి
ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లె గ్రామంలో తాగునీటి ఎద్దడిని తీర్చాలంటూ గ్రామస్థులు కలెక్టరేట్‌కు వచ్చి జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిసి సమస్యలను విన్నవించి వినతిపత్రం అందించారు. మొర్రాయిపల్లె గ్రామంలో పాఠశాల దగ్గర ఉన్న బోరుబావి పక్కనే ఉన్న దమ్మలింగం అనే రైతు తనపొలంలో బోరువేయడంతో దీనిపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయడంతో ఆ బోరును సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అయితే దమ్ములింగం తహసీ ల్దార్ సీజ్ చేసిన బోర్‌ను తొలగించి మోటార్‌ను బిగించి అక్రమంగా నీటిని వినియోగించుకుంటు న్నాడని తెలిపారు. దీనిపై విచారణ జరిపించి ఆ బోర్‌ను మూసి వేసి గ్రామస్థులకు తాగునీరు అందిస్తున్న బోరును కాపాడాలని కోరారు.
ఫ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
సిరిసిల్ల పట్టణంలోని 29వవార్డు శివనగర్, ప్రగతి నగర్‌లో ఇళ్లులేని మమ్ములను డబుల్ బెడ్‌రూంల కోసం రెండు సంవత్సరాల క్రితం మున్సిపల్ అధికా రులు ఎంపిక చేసి లిస్ట్‌ను విడుదల చేయడం జరిగిం దని ఇప్పటి వరకు మాకు డబుల్ బెడ్‌రూంలను ఇవ్వలేదంటూ లబ్ధిదారులు సోమవారం సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌కు తరలివచ్చి కలెక్టర్‌ను కలిసి సమస్యను విన్నవించి తమకు ఇళ్లను కేటాయించాలం టూ వేడుకున్నారు. 29వ వార్డులో 18 మంది లబ్ధిదా రులను ఎంపిక చేయడం జరిగిందని ఆరు నెలల క్రితం మీ అందరికి ఇళ్ల నిర్మాణాలకు ఇందిరమ్మ పథ కం స్థలాలను కేటాయించడం జరిగిందని రెవెన్యూ అధికారులు ఫోన్‌లు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందించి డబుల్ బెడ్‌రూంలు కాకుం డా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునేందుకు స్థలంలో డబ్బులు ఇవ్వాలంటూ వేడుకున్నారు. ఈ కార్యక్ర మంలో అకుబత్తిని రేణుక, అమరగొండ రూప, నర్సవ్వ, భారతమ్మ, మాధవి, భారతి, వేముల వనజ, సిరిమల్ల పల్లవి, తెంబరవేణి రేణుక పాల్గొన్నారు.
ఫ పశువులకు నీటి కుండీలను నిర్మించండి
వేమలవాడ అర్బన్ పరిధిలోని చింతల్‌ఠాణా ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో పశువుల కోసం నీటి కుండీ లను నిర్మించడంతో పాటు పశువైద్యశాలకు సిబ్బంది ని నియమించాలంటూ గ్రామస్థులు సోమవారం జిల్లా కలెక్టరేట్‌కు తరలివచ్చి జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందించి వేడుకున్నారు. కాలనీలో పశు వైద్యశాల భవనం నిరుపయోగంగా ఉండడంతో పాటు పశువైద్య సిబ్బంది లేకపోవడంతో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమం నిర్వహించడం లేదన్నారు. కలెక్టర్ స్పందించి పశు వైద్యసిబ్బందిని నియమించి పశువులకు నీటి తొట్టెలను నిర్మించాలని కోరారు.కార్యక్రమంలో ఆర్‌అండ్‌ఆర్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు దేవయ్య, కొమురయ్య, వంశీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.