Share News

ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 04 , 2026 | 12:37 AM

ప్రజా వాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావా ణిలో ముందుగా గతవారం ప్రజావాణిలో

 ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ఫిర్యాదులను స్వీకరిస్తున్న కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌

సిరిసిల్ల అర్బన్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ప్రజా వాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావా ణిలో ముందుగా గతవారం ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై అధికారులతో సమీక్షించారు. వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఎలా స్పందించారో అడిగి తెలుసుకుని ప్రతి ఫిర్యాదుదారులకు వారి ఇచ్చిన సమస్యలపై ఖచ్చితంగా సమాధానాలు ఇవ్వాలని సూచించారు. ఈ ప్రజావాణికి మిషన్‌ భగీరథ ఇంట్రా ఈఈతో పాటు పలువురు అధికారులు రాక పోవడంతో వారికి నోటీసులు అందించాలని జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. ప్రజావాణిలో 196 ఫిర్యాదుల వచ్చాయి. వీటిని సంబంధిత జిల్లా అధికా రులకు అందించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ అదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లా డుతూ ప్రజావాణిలో ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యా దులను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఫిర్యాదులకు న్యాయం చేయాలని కోరారు. ఈ ప్రజావాణిలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, జడ్పీ సీఈవో వెంకట మాధవరావు , ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ నిఖితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ డివిజన్‌స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టరేట్‌తో పాటు సిరిసిల్ల , వేములవాడ అర్డీవో కార్యాలయాలల్లో ప్రతి సోమవారం నిర్వహిం చే ప్రజావాణి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా రెవెన్యూ డివిజన్‌లలో ప్రజా వాణి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంద న్నారు. సోమవారం సిరిసిల్ల,వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించి ప్రజలనుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సిరిసిల్ల ఆర్డీవో ప్రజా వాణికి 5, వేములవాడ ప్రజావాణికి 4 దరఖాస్తులు వచ్చాయి. వాటిని అధికారులకు అందించి పరిష్క రించాలని ఆర్డీవోలు ఆదేశించారు.

ఫ భూభారతి ఆపరేటర్‌లను కొనసాగించాలి

జిల్లాలోని అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న భూభారతి టెక్నికల్‌ ఆపరేటర్‌లను యాధావిధిగా కొనసాగించడంతో పాటు పెండింగ్‌ వేతనాలను చెల్లించాలంటూ సోమవారం భూ భార తి టెక్నికల్‌ ఆపరేటర్‌లు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించి వేడుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్స రానికి ఫీల్డ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ సేవలను పునరుద్ధరించా లని కోరారు. 13 టెక్నికల్‌ పోస్ట్‌లను 8కి తగ్గించాలని నిర్ణయాన్ని పునపరిశీలాంచి యాధావిధిగా 13మం దిని కొనసాగించాలని వేడుకున్నారు. పెండింగ్‌లో ఉన్న 15నెలల వేతనాలను చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

ఫ సిరిసిల్లలోని వెంకంపేటలో భవాని పవర్‌లూం మాక్స్‌ సొసైటీ మాజీ అధ్యక్షుడు వెల్దండి భాస్కర్‌ సోసైటీ కార్యకలాపాలను అడ్డుకుంటున్నాడని అత నిపై చర్యలు తీసుకోవాలంటూ సొసైటీ సభ్యులు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. భాస్కర్‌ తన వద్ద ఉన్న సొసైటీ రికార్డులతో పాటు లావాదేవీ రికార్డులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడు తున్నాడని తెలిపారు. రూ 8లక్షలను వ్యక్తిగత తన ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొ న్నారు. అతనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకో వాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు అన్నల్‌దాస్‌ పర్శరాములు, సత్తయ్య, రాజేశం, రవి, సందీప్‌, రేణుక, సునీత, సత్తయ్య పాల్గొన్నారు.

మున్సిపల్‌ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై

చర్యలు తీసుకోవాలి

సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని సర్వేనంబర్‌ 525, 530/సీలో ప్లాట్‌ నంబర్‌ 13లో 121 చదరపు గజాల స్థలాన్ని మున్సిపల్‌కు గుడూరి పర్శరాములు, కొక్కుల ఎల్లప్పలు ఇవ్వడం జరిగిందని దీనిని పట్టణానికి చెందిన ప్రముఖ వ్యక్తి సోదరుడు కబ్జా చేశాడని విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఎర్రం విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

వేములవాడలో జగిత్యాల బస్టాండ్‌

నిర్మాణ అనుమతులు రద్దు చేయాలి

- వేములవాడ మున్సిపల్‌

మాజీ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాఽధవిరాజు

వేములవాడలో జగిత్యా ల బస్టాండ్‌ నిర్మాణ అను మతులు రద్దు చేయాలని వేములవాడ మున్సిపల్‌ మాజీ చైర్‌ పర్సన్‌ రామతీర్థపు మాఽధవిరాజు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. వేములవాడ పట్టణం లోని జగిత్యాల బస్టాండ్‌ ప్రాంతంలో సర్వేనంబర్‌ 853లోని 20 ఎకరాల 20గుంటల ప్రభుత్వ భూమిలో బస్టాండ్‌ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో అనుమతులు రాగా 2017లో జిల్లా కలెక్టరేట్‌ నుంచి ఆ స్ధలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ ఉత్తర్వులు జారీ చేశా రన్నారు. అయితే ఆ స్థలంలో నిర్మాణా లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తోట్ల లక్ష్మీ, మ్యాకల లచ్చయ్యలకు రెండు అనుమతులను వేములవాడ టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌ అధికారులు 2020 చట్టం పాటించకుండా ఇచ్చారని తెలిపారు. దీనిపై విచారణ జరిపించి నిర్మాణాలకు ఇచ్చిన అనుమతు లను రద్దు చేయాలంటూ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు.

Updated Date - Aug 04 , 2026 | 12:37 AM