ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి
ABN , Publish Date - Aug 26 , 2026 | 10:49 PM
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యా దుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని మంచిర్యాల డీసీ పీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. బుధవారం ఆయన వార్షిక తనిఖీల్లో భా గంగా జైపూర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అనంతరం జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ నవీన్, ఎస్‌ఐ భూమేష్‌లు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్
జైపూర్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యా దుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని మంచిర్యాల డీసీ పీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. బుధవారం ఆయన వార్షిక తనిఖీల్లో భా గంగా జైపూర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అనంతరం జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ నవీన్, ఎస్‌ఐ భూమేష్‌లు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించి పోలీస్‌స్టేషన్ పరిసరాలను, పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వా హనాలను పరిశీలించారు. పోలీస్‌స్టేషన్ ఆవరణను పరిశుభ్రంగా ఉం చుకోవాలని సూచించారు. రిసెప్షన్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి, రికార్డులను తనిఖీ చేశారు. స్టేషన్ రైటర్లతో మాట్లాడి, ఆన్‌లైన్‌లో కేసుల వివరాల నమోదు, అప్‌లోడ్ ప్రక్రియపై వివరాలు తెలుసకున్నారు పెండింగ్ కేసుల ఫైల్లు, క్రైం రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, పో లీస్ సిబ్బంది ఎళ్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతల ప రిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలతో సత్పంబంధా లు పెంపొందించుకుంటూ సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవా లన్నారు. మత్తుపదార్థాల నిర్మూలను ప్రత్కేయ కృషి చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు రాత్రివేళల్లో పెట్రో లింగు ను మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. అనం తరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.