kumaram bheem asifabad-టికెట్ల కోసం పోటాపోటీ
ABN , Publish Date - Jan 23 , 2026 | 10:58 PM
మున్సిప ల్ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీల టెకెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఆయా వార్డులు, చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల కోసం వేటను కొనసాగిస్తు న్నాయి. షెడ్యూల్ ఏ క్షణం విడుదలైనా ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు సంసిద్ధం గా ఉన్నారు.
- కొత్త ముఖాలను బరిలోకి దింపే అవకాశం
- క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న నాయకులు
- మున్సిపోల్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీలు
కాగజ్‌నగర్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): మున్సిప ల్ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీల టెకెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఆయా వార్డులు, చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల కోసం వేటను కొనసాగిస్తు న్నాయి. షెడ్యూల్ ఏ క్షణం విడుదలైనా ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు సంసిద్ధం గా ఉన్నారు. ఈనేపథ్యం లో ప్రధాన రాజకీయ పక్షాలు మున్సిపల్ చైర్మన్ స్థానాలపై గురి పెట్టి పావులు కదుపుతున్నాయి. ప్రధాన పార్టీల టికెట్లను సొంతం చేసుకోవడానికి ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
- జిల్లాలో 50 వార్డులు..
జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లో మొత్తం 50 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగజ్‌నగర్ మున్సిపాల్టీలో 30 వార్డులు, ఆసిఫాబాద్‌లో 20 వార్డులకు ఎన్నికలు నిర్వహించనుండడంతో టికెట్ల కేటాయింపు ప్రధాన పార్టీలకు సవాలుగా మారింది. అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ, రాజకీయ పార్టీల్లో మాత్రం టికెట్ల కేటాయింపు ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య భారీగా ఉండడంతో అంతర్గతంగా తీవ్రంగా పోటీ మారింది. ప్రతీ వార్డులో ఇద్దరు, ముగ్గురు టికెట్టును ఆశిస్తుండంతో ఎవరికి కేటాయించాలన్నది పెద్ద సవాలుగా మారింది. టికెట్టు ఆశిస్తున్న వారు పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. సామాజిక సమీకరణాలు, స్థానిక బలం ఆధారంగా పార్టీ విధేయంగా పని చేసిన వారికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న వాదన మరో వైపు వినిపిస్తోంది. ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి సుగుణ, సిర్పూరులో ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఈ వ్యవహరాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఉదయం వేళ వార్డుల్లో పర్యటిస్తున్నారు. టికెట్టు కేటాయింపుపై వాకాబు చేస్తున్నారు. కౌన్సిలర్ స్థానం కోసం ఆశిస్తున్న వ్యక్తి యొక్క వివరాలు, బలాబాలపై పూర్తి అఽధ్యాయనం చేస్తున్నారు. ఓటర్లతోనే స్వయంగా మాట్లాడుతుండడం బట్టి పరిశీలిస్తే పార్టీ బలోపేతం కోసం ఎంతమేర కృషి చేస్తున్నారన్న విషయం తెలియనుందని భావిస్తున్నా రు. బీఆర్‌ఎస్‌లోను అదే పరిస్థితి నెలకొంది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఉన్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కొంత మేర బీఆర్‌ఎస్‌కు ప్లస్ అయ్యే అవకాశాలున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసిఫాబాద్ నియోజకర్గంలో 20 వార్డుల్లో పోటీ ఎక్కువగానే ఉంది. టికెట్ల కేటాయింపుపై ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. సిర్పూరు నియోజవర్గంలో ధర్మసంకట పరిస్థితి ఏర్పడింది. కాగజ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ పార్టీలో కొనసాగుతున్నారు. ఆశావ హులకు టికెట్టు కేటాయింపులో ఇరువురు తమ క్యాడర్‌ను బరిలో దింపేందుకు పూర్తి జాబితాను సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతుంది. బీ ఫాం అందజేత మాత్రం కొరకరాని కొయ్యగా మారిందని పలువురు పేర్కొంటున్నారు. బీఆర్‌ఎస్ అధిష్టానం జోక్యం చేసుకొని బీఫాం వ్యవహారం కొలిక్కి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. జిల్లాలో ఆసిఫాబాద్, సిర్పూరు నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ కూడా తమ బలాన్ని చూపేందుకు సిద్ధమవుతున్నది. స్థానిక సంస్థల్లో చెప్పుకోదగ్గ సీట్లు రాకున్నప్పటికీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఉందని నిరూపించుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. సిర్పూరు ఎమ్మెల్యే కౌన్సిలర్ టికెట్ల కేటాయింపు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పార్టీ మద్దతుదారులు, కాలనీవాసుల అభీష్టం మేరకు అభర్థుల ఎంపిక చేస్తున్నట్టు తెలిసింది.
ఫప్రజాభిప్రాయం మేరకే..
జిల్లాలో మున్సిపాలిటీల్లోని ఆయా వార్డుల్లో ప్రజాభిప్రాయం మేరకే ప్రధాన పార్టీలు టికెట్లను కేటాయించే అవకాశం ఉంది. ఈ విషయంలో సం బంధిత వార్డుల్లోని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, ముఖ్య కార్యకర్తల సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే టికెట్లను ఫైనల్ చేసే అవకాశా లున్నట్లు తెలుస్తోంది. గెలుపు గుర్రాలను బరిలో నిలిపేందుకు ఆయా పార్టీల నాయకులు ప్రయత్ని స్తున్నారు. ఎలాగైనా ఈ సారి ఎన్నికల్లో కాగజ్‌నగర్ మున్సిపాల్టీలో బీజేపీ కైవసం చేసుకునేలా పావులు కదుపుతున్నారు. బీఎస్పీ కూడా 30 వార్డులో తమ అభ్యర్థులను బరిలో దింపేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటోంది. ప్రతి వార్డు నుంచి నాలుగు ప్రధాన పార్టీ అభ్యర్థులు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండే అవకాశాలున్నాయి.