నేరాల అదుపునకు కమ్యూనిటీ ప్రోగ్రాం
ABN , Publish Date - Apr 10 , 2026 | 10:53 PM
సమాజంలో జరుగుతున్న నేరాల అదుపునకు కమ్యూ నిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం నిర్వహిస్తున్నమని మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్ అన్నారు.
మంచిర్యాల ఏసీపీ ప్రకాష్
నస్పూర్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి) : సమాజంలో జరుగుతున్న నేరాల అదుపునకు కమ్యూ నిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం నిర్వహిస్తున్నమని మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్ అన్నారు. నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోనియా నగర్, శ్యామ్ నగర్ ఏరియాల్లో శుక్రవారం సీసీసీ పోలీసుల ఆద్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేసి 60 ద్విచక్ర వాహనాలు, ఏడు అటోలకు సరైనా పత్రాలు లేకపోవడంతో వాటి యజమానులకు జరి మానాలు వేసారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ మద్య కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయని, వాటి నియం త్రణకు ప్రతీ ఒక్కరూ భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వాహనదారుడు ఖచ్చితంగా తన వాహనానికి సంబంధించి అన్ని రకాల పత్రాలను కలిగి ఉండాలన్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపొద్దన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి రోడ్డుపైకి పంపవద్దన్నారు. వేసవి సెలవుల సందర్బంగా ఊర్లకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విలువైనా వస్తువులు ఇంటి లో వదిలివెళ్లవద్దని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ఏసీపీ కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్, లతో పాటు శ్యామ్ నగర్, సోనియా నగర్ ప్రాంతాల వాసులు, పోలీసులు పాల్గొన్నారు.