Share News

భద్రత భావాన్ని పెంపొందించేందుకే కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:30 PM

ప్రజల లో భద్రత భావాన్ని పెంపొందించడం, నేర స్థుల కదలికలపై నిఘా ఉంచేందుకే కమ్యూ నిటీ కాంటాక్టు ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు జైపూ ర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నారు.

భద్రత భావాన్ని పెంపొందించేందుకే కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం
స్వాధీనం చేసుకున్న నాటుసారా, ద్విచక్రవాహనాలతో ఏసీపీ, పోలీసులు

-జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు

కోటపల్లి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) : ప్రజల లో భద్రత భావాన్ని పెంపొందించడం, నేర స్థుల కదలికలపై నిఘా ఉంచేందుకే కమ్యూ నిటీ కాంటాక్టు ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు జైపూ ర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. గురు వారం మండలంలోని దేవులవాడ గ్రామంలో కమ్యూ నిటీ కాంటాక్టు ప్రోగ్రాం నిర్వహించి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 2 వేల లీట ర్ల బెల్లం పానకం ధ్వంసం చేయడంతో పాటు 70 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలను , ఐదు ఆటోలను సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రజలతో మాట్లాడుతూ చట్టవ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపు తామని హెచ్చరించారు. అరైవ్‌ అలైవ్‌లో భా గంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒ క్కరు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూ చించారు. మద్యం సేవించి వాహనం నడప డం, అతి వేగం వంటి నిర్లక్ష్యపు చర్యల వల్ల కుటుంబాలు వీధిన పడతాయని, హెల్మెట్‌ , సీటు బెల్టు ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మ హిళలు, చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిం చే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ఏదైనా ఆపద కలిగితే వెంటనే పోలీసులకు సమాచా రం ఇవ్వాలని, గ్రామాల రక్షణ కోసం ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాల ను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్ర మంలో చెన్నూరు టౌన్‌ సీఐ బన్సీలాల్‌, రూర ల్‌ సీఐ కృష్ణ, ఎస్‌ఐలు రాజశేఖర్‌, సుబ్బారావు, జగదీశ్వర్‌రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 11:30 PM