నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాంటాక్ట్
ABN , Publish Date - Jun 21 , 2026 | 11:35 PM
నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాం టాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ అ న్నారు.
బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్
భీమిని, జూన్ 21 (ఆంధ్రజ్యోతి) : నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాం టాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ అ న్నారు. మండలంలోని మల్లీడి గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బగూడెం గ్రామంలో ఆదివారం బెల్లంపల్లి ఏసీపీ ఆధ్వర్యంలో ఉదయం ఆరు గం టలకు పోలీస్ అధికారులతో, సిబ్బందితోకమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతీ ఇంటిని తనిఖీ చేసి సరైన పత్రాలు లేనటువంటి 60 బైక్‌లతో పాటూ వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజల రక్షణ, భద్రత పోలీసుల బాధ్యత అని, గ్రామాల్లో కొత్త వ్యక్తులు నేరస్తులు, షెల్టర్ తీసుకోని ఉంటే వెంటనే సమాచారం పోలీసులకు అందించాలన్నారు. గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా 100 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్స్, మెస్సేజ్, వాట్సప్ కాల్స్‌లకు స్పందించరాదన్నారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీటు బెల్టులు విధిగా పెట్టుకోవాలన్నారు. గ్రామంలో స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ధృవీకరించిన విత్తనాల కేంద్రాల వద్దనే రసీదులు పొంది విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. తాండూర్ సీఐ దేవయ్య, బెల్లంపల్లి రూరల్ సీఐ అనూక్, భీమిని, కన్నెపల్లి, తాళ్లగురియాల, నెన్నెల, బెల్లంపల్లి టూటౌన్ ఎస్సైలు కోటేశ్వర్, భాస్కర్, రామకృష్ణ, రామకృష్ణ, కిరణ్ కుమార్, పలు మండలాల హెడ్ కానిస్టేబుల్లు, కానిస్టేబుల్లు తదితరులు పాల్గొన్నారు.