kumaram bheem asifabad- నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్
ABN , Publish Date - Aug 30 , 2026 | 10:53 PM
నేరాల నియంత్రణకు కమ్యూనిటీ కాంటాక్టు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రెబ్బెన సీఐ సంజయ్ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ కాలనీలో ఆదివారం కమ్యూనిటి కాంటాక్టు కార్యక్రమాన్ని నిర్వహించారు.
రెబ్బెన, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణకు కమ్యూనిటీ కాంటాక్టు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రెబ్బెన సీఐ సంజయ్ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ కాలనీలో ఆదివారం కమ్యూనిటి కాంటాక్టు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరిచత వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు తెలుపరాదన్నారు. రోడ్డు భద్రత నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పారు. వాహనాలు నడిపే సమయంలో ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కనపడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గంజాయి, గుడంబా, రేషన్ బియ్యం, వంటి అక్రమ రవాణా దృష్టికి వస్తే వెంటనే 112కు డయల్ చేయాలని లేని పక్షంలో స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై వెంకట కృష్ణతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నామని ఎస్సై మహేందర్ అన్నారు. మండలంలోని నార్లపూర్ గ్రామంలో ఆదివారం పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 40 వాహనాలను స్వాఽధీనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూసైబర్ నేరాల పట్ల అవగాహన, ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలను అపరిచితులకు చెప్పకూడదన్నారు. గుంబా, మధ్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. రోడ్డు భద్రత నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పారు. వాహనాలు నడిపే సమయంలో ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. గ్రామంలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కనపడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గంజాయి, గుడంబా, రేషన్ బియ్యం, వంటి అక్రమ రవాణా దృష్టికి వస్తే వెంటనే 112కు డయల్ చేయాలని లేని పక్షంలో స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత చదువులపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.