Share News

kumaram bheem asifabad- పెద్దపులి అలజడి

ABN , Publish Date - Nov 24 , 2026 | 10:46 PM

జిల్లా లో పత్తి తీసే సమయంలో మళ్లీ పెద్దపులి అలజడి రైతులను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ నెల 16న సిర్పూర్‌ (టి) మండలంలో పెద్దపులి పశువుల మందపై దాడి చేసి మూడు దూడలను హతమా ర్చింది. దీంతో జిల్లా అటవీశాఖ అధికారులు అప్రమత్తమ య్యరు. అటవీశాఖ సమీప గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పులి కదలికలపై నిఘా పెట్టారు.

kumaram bheem asifabad- పెద్దపులి అలజడి
లోగో

- వ్యవసాయ పనుల వేళ భయాందోళనలో రైతులు

ఆసిఫాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా లో పత్తి తీసే సమయంలో మళ్లీ పెద్దపులి అలజడి రైతులను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ నెల 16న సిర్పూర్‌ (టి) మండలంలో పెద్దపులి పశువుల మందపై దాడి చేసి మూడు దూడలను హతమా ర్చింది. దీంతో జిల్లా అటవీశాఖ అధికారులు అప్రమత్తమ య్యరు. అటవీశాఖ సమీప గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పులి కదలికలపై నిఘా పెట్టారు. గతంలో మనుషులపై పెద్దపులుల దాడులు నవంబరులోనే జరిగిన నేపథ్యంలో వ్యవసాయ కూలీలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 3.4 లక్షల ఎకరాల్లో పత్తి, 50 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుతం పత్తి తీసే పనులు, వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. పెద్దపులుల సంచారంతో సిర్పూర్‌(టి), కౌటాల, బెజ్జూర్‌, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట్‌ మండలాల్లోని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.

- సున్నితంగా పెద్దపులి పాదం..

పెద్దపులి పాదం(పంజా) సాధారణంగా సున్ని తంగా ఉంటుంది. దీంతో సురక్షిత ప్రాంతాల మీదు గానే ప్రయాణం సాగిస్తుంది. ఈ క్రమంలోనే దట్ట మైన టేకు వనాలను వదిలి పొదలు, పెద్ద వాగు పరిసరాల్లోని ఇసుక ప్రాంతాలు, వెదురు ప్రాంతం లో ఆవాసం ఏర్పాటు చేసుకుంటుంది. మహారాష్ట్ర వైపు ఉన్న అటవీ ప్రాంతాల్లో పులుల సంతతి గణ నీయంగా పెరగడంతో రాష్ట్ర సరిహద్దు దాటి కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌ పరిధిలోకి వలస వస్తు న్నాయి. ఏటా ఇదే సమయంలో మహారాష్ట్ర నుంచి కాగజ్‌నగర్‌కు పులుల రాకపోకలు అధికంగా ఉంటా యి. గత ఆగస్టులోనూ ఓ పులి మహారాష్ట్ర నుంచి వచ్చివెళ్లిపోయింది. ప్రస్తుతం డివిజన్‌లోనే కొన్ని పులులు ఆవాసం ఏర్పాటు చేసుకోగా.. కొత్తవి మా త్రం తాడోబా, తిప్పేశ్వర్‌, ఇంద్రావతి అభయార ణ్యాల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయని అధికా రులు చెబుతున్నారు.

- సిర్పూర్‌ డివిజన్‌ పరిధిలో..

ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌ అటవీ డివిజన్‌ పరిధిలో విస్తారమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయి. కౌటాల, సిర్పూర్‌(టి), బెజ్జూరు, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట్‌, కాగజ్‌నగర్‌, దహెగాం ప్రాంతాల్లోని అడవులు పులుల సంచారానికి అనుకూలంగా ఉన్నాయి. దీంతోపాటు వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ప్రాణహిత, పెన్‌గంగా, వార్ధా నదులు, చెరువులు, చిన్ననీటి వనరులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా ఏటా నవంబరు నుంచి జనవరి వరకు పులి సంచారం ఎక్కువగా ఉంటుంది. పులులు జతకట్టే సమయం కావడంతో మహారాష్ట్ర నుంచి పులుల రాకపోకలు పెరుగుతుంటాయి. జిల్లాలో స్థిరనివా సం ఏర్పాటు చేసుకుంటాయి. ఇక్కడఅటవీ ప్రాంతా లకు సమీపంలో గ్రామాలు విస్తరించి ఉండడం పులుల అవాసానికి సమస్యగా మారుతోంది. జి ల్లాలో నాలుగైదు ఏళ్లుగా పశువులతో పాటు వ్యవ సాయ కూలీలపై కూడా దాడులు చేశాయి. 2024 నవంబరు 28న కాగజ్‌నగర్‌ మండలంలోని నజ్రూ ల్‌నగర్‌లో పత్తి ఏరుతున్న మోహర్లే లక్ష్మిపై పులి దాడి చేసి చంపింది. సిర్పూర్‌(టి) మండలంలోని దుబ్బగూడ గ్రామంలో పత్తి చేలలో పత్తి ఏరుతున్న రైతు సురేష్‌ పై దాడి చేసి గాయపరిచింది. ఈ ఏడాది ఆగస్టు 19న సిర్పూర్‌-టి మండలం చీలపల్లి గ్రామంలోని మల్లు చెందిన గేదె ఇటికలపహడ్‌ అటవీ ప్రాంతానికి మేతకు వెళ్లగా పెద్దపులి దాడి చేయడంతో మృతి చెందింది. తాజాగా ఈ నెల 16న సిర్పూర్‌(టి) అటవీ రేంజ్‌ పరిధిలోని మాకిడి సెక్షన్‌ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన పశువుల మందపై పెద్దపులి దాడి చేయగా చీలపల్లి గ్రామా నికి చెందిన రైతులకు సంబంధించిన మూడు లేగ దూడలు మృతి చెందాయి. కౌటాల మండలం వీర్దండిలో పంట చేనులో అడవి పందిపై దాడి చేసి హతమార్చింది. ఇటీవల బెజ్జూర్‌లోనూ ఓ చిరుత పులి పశువులపై దాడి చేసింది.

- అధికారులు అప్రమత్తం..

కాగజ్‌నగర్‌ అటవి డివిజన్‌లో పులి సంచారం పెరిగిన నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్ర మత్తమయ్యారు. పులి సంచారం ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉందనే విషయంతో పాటు పులి ఎక్క డకు వెళుతుందో ట్రాక్‌ చేస్తున్నారు. పులి సంచారా నికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు పులి వల్ల మనుషులకు, పశువులకు ఎలాంటి హనీ జరుగకుండా చర్యలు తీసుకుంటు న్నారు. ఆయా రేంజ్‌ పరిధిలో గ్రామాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. పులులపై దాడులు చేయడం, హతమార్చడం తీవ్రమైన నేరమని, నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచి స్తున్నారు. పులి సంచారం ఎక్కువగా ఉన్న మండ లాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తు న్నారు. పెద్దపు లుల సంచారంతో సిర్పూర్‌(టి), కౌటాల, బెజ్జూర్‌, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట్‌ మండలాల్లోని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు వ్యవ సాయ క్షేత్రాలతోపాటు గ్రామాలకు సమీపంలోని నివాస ప్రాంతాల వద్ద కూడా సంచారానికి సంబంఽ దించిన ఆనవాళ్లు కనిపించడం.. స్థానికులను మరిం త భయాందోళనకు గురిచేస్తోంది.

Updated Date - Nov 24 , 2026 | 10:46 PM