కమిషనర్ వర్సెన్ చైర్‌పర్సన్...
ABN , Publish Date - Aug 01 , 2026 | 10:46 PM
క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలో చైర్‌పర్సన్ సంధ్యారాణి, కమిషనర్ మురళీకృష్ణ మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ తీ వ్రతరం అవుతోంది. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకునేంత వరకు పరిస్థితులు వెళ్లడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
-ఇరువురి మధ్య పెరుగుతున్న అగాధం
-క్యాతనపల్లి మునిసిపాలిటీని చుట్టుముట్టిన వివాదాలు
-పరస్పరం పోలీసులకు ఫిర్యాదు
-బల్దియాలో కుంటుపడుతున్న అభివృద్ధి
మంచిర్యాల, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలో చైర్‌పర్సన్ సంధ్యారాణి, కమిషనర్ మురళీకృష్ణ మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ తీ వ్రతరం అవుతోంది. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకునేంత వరకు పరిస్థితులు వెళ్లడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఓ వైపు పట్టణ ప్రథ మ పౌరురాలు, మరోవైపు పట్టణాన్ని అభివృద్ధి వైపు న డిపించాల్సిన అధికారి మధ్య నెలకొన్న వాగ్వాదం కార ణంగా కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బం దులకు గురవుతున్నారు. మునిసిపాలిటీకి కుడి, ఎడమ భుజాలుగా ఉండాల్సిన వారు ఎడ ముఖం, పెడము ఖంగా ఉంటుండటంతో సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వెళ్తున్న ప్రజలు సైతం తీవ్ర అసౌక ర్యాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది పరిస్థితి మాత్రం కుడి దిలో పడ్డ ఎలుకల మాదిరిగా తయారైందన్న అభి ప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎవరి ఆదేశా లు అమలు పరిస్తే....ఏం జరుగుతుందోనన్న భయాం దోళనలో వారంతా ఇబ్బందులు పడుతున్నట్లు ప్రచారం జరగుతోంది. మునిసిపాలిటీలో నెలకొన్న ప్రతికూల వా తావరణం కారణంగా కొన్ని విభాగాల అధికారులు డి ప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
చెలరేగిన ప్రొటోకాల్ వివాదం...
క్యాతనపల్లిలో చైర్‌పర్సన్, కమిషనర్ మఽధ్య ప్రోటోకాల్ వివాదం చెలరేగడంతో అది తీవ్రరూపం దాల్చింది. కమిషనర్ వార్డు పర్యటనల గురించి చైర్‌పర్సన్‌కు సమాచారం ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. కనీసం వార్డు కౌన్సిలర్లకు కూడా సమాచారం ఇవ్వకపోవడంతో వారంతా గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వార్డుల్లో చేపడుతున్న అభివృద్ది పనుల్లోనూ కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నట్లు బాహాటంగా చర్చ జరుగుతోంది. కమిషనర్ వ్యవహార శైలిపై ఏకంగా పలువురు ప్రజలు చైర్‌పర్సన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసిన దాఖలాలు అనేకం ఉన్నాయి. ఈ విషయాలపై చైర్‌పర్సన్, కమిషనర్‌కు వైఖరి మార్చుకో వాలని సూచించడంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగిం ది. చైర్‌పర్సన్ సొంత వార్డు విజిట్‌లోనూ ఏకపక్షంగా వ్యవహరించినట్లు తెలిసింది. విజిట్‌లో భాగంగా వార్డు అభివృద్ధిపై చైర్‌పర్సన్, ప్రజలతో కాకుండా వార్డుకు సంబంధంలేని వ్యక్తులతో కమిషనర్ మాటి మాటికి చ ర్చించడం పట్ల తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉం డగా, మునిసిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో ఉన్న ఓ చిన్న టీ కొట్టు నిర్వాహకునికి ట్రేడ్ లైసెన్స్ లేదనే కార ణంతో నోటీసు జారీ చేయడం కూడా ప్రజలను ఆశ్చ ర్యానికి గురి చేసింది. మునిసిపాలిటీ పరిధిలో బడా షాపులు అనేకం ఉండగా, వాటిలో చాలా వరకు ట్రేడ్ లైసెన్సులు లేవని ప్రజలు చెబుతున్నారు. వారి వద్ద లైసెన్స్ ఫీజులు కూడా వసూలు చేయడం లేదని సి బ్బంది చెబుతున్నారు. కమిషనర్ వైఖరిపై గత నెల 25న బాధితుడు చైర్‌పర్సన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యా దు చేశారు. అలాగే కమిషనర్ అద్దెకుండే వీధిలో అప్ప టికప్పుడు రోడ్డు వేయించినట్లు ప్రచారం జరగుతోంది. అదికూడా మునిసిపాలిటీ తీర్మాణం లేకుండా రోడ్డు నిర్మించడం విమర్శలకు దారి తీస్తోంది.
రాజకీయ విబేధాలే కారణం....
క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలో నెలకొన్న వివాదానికి ముఖ్యంగా రాజకీయ విబేధాలే కారణంగా తెలుస్తోంది. చైర్‌పర్సన్ సంధ్యారాణి బీఆర్‌ఎస్ నేత కావడంతో ఆమె పరపతి తగ్గించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు స మాచారం. వాస్తవంగా మునిసిపాలిటీ పరిధిలో చేపట్టే ఏ చిన్న అభివృద్ధి పనినైనా చైర్‌పర్సన్ సమక్షంలో కౌన్సి ల్ తీర్మాణం చేయాల్సి ఉంటుంది. అప్పుడే అభివృద్ధి ప నులు పట్టాలెక్కాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి తీర్మా ణాలు చేయకుండానే అధికారులు పలు పనులు చేప ట్టినట్లు ఆధారాలు ఉన్నాయి. స్థానికంగా ఓ రైస్ మిల్లు పక్కన నుంచి నిర్మించిన సీసీ రోడ్డు కూడా వివాదానికి కారణం అయింది. వివిధ వార్డుల్లో దశాబ్దాల కాలంగా రోడ్లు నిర్మించాలని ప్రజలు పదేపదే కోరుతున్నా పట్టని అధికారులు, కొందరికి మేలు చేసే విధంగా డిమాండ్ లేని చోట అత్యవసరంగా సీసీ రోడ్లు నిర్మించారనే అప వాదు ఉంది. వాటిపైనా విచారణ జరిపించాలనే డి మాండ్‌లున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేకానంద ప్రాతినిథ్యం వహిస్తున్న చె న్నూర్ నియోజకవర్గం పరిధిలోని క్యాతన్‌పల్లి మునిసి పాలిటీలో వివాదం చెలరేగుతుండటం గమనార్హం. ము నిసిపాలిటీలో రాజకీయాలు ఉంటే ఆయా పార్టీల నేత లు చూసుకుంటారని, అందులో అధికారులు జోక్యం చే సుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే రాజకీయాలకు తావు లేకుండా మున్సిపాలిటీలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకుని మున్సిపాలిటీ వార్డుల అభివృద్ధికి పాటుపడడం మంచిదని స్థానికులు హితవు పలుకుతున్నారు. ఈ విషయమై మంత్రితోపాటు జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారించడం ద్వారా సమస్యను పరిష్కరించాలనే విజ్ఞప్తులు ప్రజల నుంచి ఉన్నాయి.