kumaram bheem asifabad- రంగవల్లుల పోటీకి రారండి..
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:04 PM
సంక్రాంతి పండుగ సందర్భంగా సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్లబ్ వేదికగా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించనుంది. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్ బై: సన్‌ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్‌వాసి అగరబత్తీ ఆధ్వర్యంలో జరిగే పోటీలకు మహిళలు, యువతల నుంచి ఆహ్వానం పలుకుతోంది
కాగజ్‌నగర్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సందర్భంగా సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్లబ్ వేదికగా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించనుంది. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్ బై: సన్‌ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్‌వాసి అగరబత్తీ ఆధ్వర్యంలో జరిగే పోటీలకు మహిళలు, యువతల నుంచి ఆహ్వానం పలుకుతోంది. ఆదివారం ఉదయం కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు క్లబ్( ఎస్పీ ఎం క్లబ్)లో పోటీలు ప్రారంభం కానున్నాయి. ఆకట్టుకునేలా రంగవ ల్లులు వేసిన మహిళలకు బహుమతులు అందించి ప్రోత్సాహం అందించనున్నారు. ఇందుకు గాను పోటీల నిర్వహణ స్థలంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. లోకల్ స్పాన్సర్‌గా సిర్పూర్ పేపర్ మిల్లు యజమాన్యం వ్యవహరించనున్నది. విజేతలకు ప్రథమ బహుమతి రూ.6 వేలు, ద్వితీయ బహుమతి రూ.4 వేలు, తృతీయ బహుమతి కింద రూ.3 వేలు అందించనున్నారు. ఈ ముగ్గుల పోటీలకు జిల్లాలోని మహిళలందరూ ఆహ్వానితులే. ఈ పోటీలలోని విజేత ఈ నెల 12 హైదరాబాదలో నిర్వహించే పైనల్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ పోటీల్లో 33 జిల్లాలోని మహిళలు పాల్గొంటారు. పోటీల్లో మహిళలు మాత్రమే పాల్గొనాలి. చుక్కల ముగ్గులు మాత్రమే చేతితో వేయాలి. పరికరాలు వాడ రాదు. జల్లెడ మాత్రం వాడవచ్చు. ముగ్గు, రంగులు, పువ్వులు ఇతరత్రా సామాగ్రి పోటీదారులే తెచ్చుకోవాలి. ముగ్గులో ఎన్ని చుక్కలు, ఎన్ని వరు సలో చెప్పగలిగి ఉండాలి. ముగ్గు వేయడానికి గరిష్ట సమయం రెండు గంట లు. గొబ్బెమ్మలు, బతుకమ్మ వంటివి తప్ప ఇతర వస్తువులు ఎక్కువగా అలం కరించవద్దు. గొట్టాలు, బద్దలు వాడొద్దు. వాడితే మార్కులు కట్ అవుతాయి. ఇళ్ల నుంచి కళశాలు, అందమైన ఇతర వస్తువులు తీసుకవచ్చి, అమర్చి వాటి చుట్టూ నామమాత్రంగా ముగ్గు వేయడం సరికాదు. దీనికి కూడా మార్క్‌లు కట్ అవుతాయి. ముగ్గు అదనపు అందానికే వస్తువులను వాడాలి తప్ప ఇతర వస్తువులు ప్రాధాన్యం కాకూడదు. పోటీల్లో పాల్గొనేవారు ఇతర వివరాలకు, పేర్ల నమోదుకు 9985411285, 9640101149 నంబర్లలో సంప్రదించవచ్చు.