కలరి విద్య ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది
ABN , Publish Date - Mar 01 , 2026 | 11:37 PM
ప్రాచీన యుద్ద కళ కలరి విద్య ఆత్మవిశ్వాసాన్ని పెంపొం దిస్తుందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గా ప్రసాద్ అన్నారు. ఆదివారం పల్లంగూడలో నిర్వహించిన సత్యధమ్మ ఉద్భవ ఉద్దమ్‌సింగ్ కలరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాచీన కళ మొదటి వార్షికోత్సవా నికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. అంతరించిపోతున్న ప్రాచీన కళను తెలంగాణలో సుస్ధిర పరిచేందుకు ఉద్దమ్‌సింగ్ గత ఏడాది కాలంగా నిర్వహిస్తున్నారని, ఇది గొప్ప విషయమన్నారు
కాసిపేట, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) : ప్రాచీన యుద్ద కళ కలరి విద్య ఆత్మవిశ్వాసాన్ని పెంపొం దిస్తుందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గా ప్రసాద్ అన్నారు. ఆదివారం పల్లంగూడలో నిర్వహించిన సత్యధమ్మ ఉద్భవ ఉద్దమ్‌సింగ్ కలరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాచీన కళ మొదటి వార్షికోత్సవా నికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. అంతరించిపోతున్న ప్రాచీన కళను తెలంగాణలో సుస్ధిర పరిచేందుకు ఉద్దమ్‌సింగ్ గత ఏడాది కాలంగా నిర్వహిస్తున్నారని, ఇది గొప్ప విషయమన్నారు. పిల్లలు, పెద్దలకు ఈ ప్రాచీనయుద్దకళ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దీని వల్ల ధార్మక జీవి తం మెరుగుపడుతుందన్నారు. ప్రతి ఒక్కరు కలరి విద్యను నేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో భా గంగా ఉదయం గ్రామంలో పిల్లలు, పెద్దలు భారీ ర్యాలీ నిర్వహించారు. పిల్లలు ప్రదర్శించిన యుద్దకళ, కత్తి కర్రసాము, సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో యశ్వం త్ మహారాజ్, సర్పంచులు దుస్స విజయచందు, నవనందుల పుష్పలత, నాయకులు చందు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.