బోసిపోతున్న కాలనీలు...
ABN , Publish Date - Aug 26 , 2026 | 10:53 PM
నాడు బొగ్గు గనులు, కార్మిక కుటుంబాలతో కళకళలాడిన సింగరేణి ప్రాంతం నేడు కార్మికులు లేక వెలవెలబోతున్నది. ఓ వైపు బొగ్గు గనులు మూత పడుతుండగా, మరోవైపు సింగరేణి యాజమాన్యం నూతన నియామకాలు చేప ట్టకపోవడంతో కార్మికవాడలు పూర్తిగా బోసిపోతున్నా యి.
=================
-సింగరేణిలో తగ్గుముఖం పడుతున్న కార్మికుల సంఖ్య
-గనులు మూతపడుతుండటంతో వలసబాట
-కొత్త గనుల ఏర్పాటుపై ఉదాసీన వైఖరి
-ప్రభుత్వాలు చర్యలు చేపడితేనే పూర్వవైభం
మంచిర్యాల, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): నాడు బొగ్గు గనులు, కార్మిక కుటుంబాలతో కళకళలాడిన సింగరేణి ప్రాంతం నేడు కార్మికులు లేక వెలవెలబోతున్నది. ఓ వైపు బొగ్గు గనులు మూత పడుతుండగా, మరోవైపు సింగరేణి యాజమాన్యం నూతన నియామకాలు చేప ట్టకపోవడంతో కార్మికవాడలు పూర్తిగా బోసిపోతున్నా యి. గనుల మూతతో ఇంతకాలం ఇక్కడ పనిచేసిన కా ర్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండటంతో కొన్ని ఏరియాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
నియామకాల పట్ల కానరాని శ్రద్ధ..
ఒకప్పుడు సింగరేణి ఉద్యోగం అంటేనే ప్రాణభయం తో వణికేవారు. బొగ్గుబాయిలో ఉద్యోగం చేసేందుకు వె నుకంజ వేసేవారు. కాలక్రమంలో సింగరేణి సంస్థ ఉ ద్యోగాల కల్పవల్లిగా రూపాంతరం చెందింది. బొగ్గు ఉ త్పత్తి అవసరాల కోసం అప్పటి డైరెక్టర్ జీపీ రావు నే తృత్వంలో కార్మికుల సంఖ్య పెంచేందుకు కృషి చేశారు. కార్మికులకు పరుగు పందెం పోటీలు ఏర్పాటు చేయ డం ద్వారా నియామకాలను చేపట్టేవారు. అంతకు ముందు బరువులు లేపడం ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించేవారు. 1985 ప్రాంతంలో రన్నింగ్ ద్వారా ఏకకా లంలో సుమారు 40వేల నియమాకాలు చేపట్టారు. అ లా సింగరేణిలో కార్మికుల సంఖ్య గణనీయంగా పెరి గింది. కాలక్రమంలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరి గనప్పటికీ కార్మికుల సంఖ్య మాత్రం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. సంస్థలో కార్మికులు అవసరమైన దానికంటే అధికంగా ఉన్నారనే కారణంతో వివిధ పద్ధతుల్లో యా జమాన్యం వారి సంఖ్యను తగ్గించేందుకు శ్రీకారం చు ట్టింది. గోల్డెన్ షేక్‌హ్యాండ్ పథకాన్ని తెరపైకి తేవడం ద్వారా సర్వీసు మిగిలి ఉండగానే కార్మికులను ముంద స్తుగా ఉద్యోగాల్లో నుంచి తొలగించే ప్రక్రియకు నాంది పలికింది. అలా ప్రారంభమైన కార్మికుల ఏరివేత కారణంగా సింగరేణి వ్యాప్తంగా వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది.
క్రమేపీ తగ్గుతున్న కార్మికుల సంఖ్య....
ఒకప్పుడు లక్షా పై చిలుకు కార్మికులు పనిచేసిన సింగరేణి సంస్థలో కాలక్రమేణ కార్మికుల సంఖ్య గణనీ యంగా తగ్గు ముఖం పడుతోంది. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో ఇదే పరిస్థితి నెలకొనగా ప్రస్తుతం కార్మికుల సంఖ్య 40 వేలకు పడిపోయింది. గడిచిన ఐ దేళ్ల కాలంలో ఎన్నడూ లేనివిధంగా కార్మికుల సంఖ్య వేగంగా తగ్గుముఖం పట్టగా, కొత్త నియామకాల పట్ల యాజమాన్యం ఊసెత్తకపోవడంతో సంస్థ మనుగడకు ప్రమాదం వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. సింగరే ణికి సంబంధించి జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఐదు సంవత్సరాల కిత్రం సుమారు 21వేల వరకు ఉన్న కా ర్మికుల సంఖ్య నేడు గణనీయంగా తగ్గుముఖం పట్టిం ది. ప్రస్తుతం మూడు ఏరియాలలో కలిపి 14వేల పై చిలుకు మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. రాబోయే ఐదేళ్లకాలంలో మరిన్ని గనులు మూతపడి కార్మికుల సంఖ్య సింగిల్ డిజిట్‌కు పడిపోయే ప్రమాదం ఉంది.
కొత్త గనుల ఏర్పాటు ఎప్పుడో...?
బొగ్గు ఉత్పత్తిపై సింగరేణి యాజమాన్యం చూపు తున్న శ్రద్ధ సంస్థ మనుగడపై చూపడం లేదన్న ఆరో పణలు ఉన్నాయి. ఓ వైపు అండర్ గ్రౌండ్ గనులను క్రమంగా మూసి వేస్తున్న యాజమాన్యం, వాటి స్థానం లో ఓపెన్‌కాస్టు గనులను తెరపైకి తెస్తోంది. జిల్లాలోని మూడు ఏరియాల్లో పెద్ద మొత్తంలో అండర్ గ్రౌండ్ గనులు ఇప్పటికే మూత పడగా, కొన్ని చోట్ల ఓసీల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పటికే ఆర్కే-6 అండర్ గ్రౌండ్ మైన్ జూన్‌లో మూతపడగా, రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్టు గనిని కూడా మూసివేశారు. ఇక ఆర్కే-1, ఆర్కే న్యూటెక్, ఎస్‌ఆర్పీ-1, ఆర్కే-5 గనులు రాబోయే నాలుగైదేళ్ల కాలంలో మూతపడే అవకాశాలు ఉన్నాయి. ఇవి మూతపడితే వాటిలో పనిచేసే కార్మికులు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లకతప్పని పరిస్థితి నెలకొం టుంది. ఈ కారణంగా ఇక్కడి సింగరేణి ఏరియాల్లో కార్మికుల సంఖ్య మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నా యి. ఈ ప్రాంతంలో మరో 40 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండగానే యాజమాన్యం గనుల మూసివేత దిశగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉండగా మంద మర్రి ప్రాంతంలో కొత్తగా కేకే 6 అండర్ గ్రౌండ్ మైన్, శ్రావణపల్లి ఓసీ గనులు వచ్చే అవకాశాలున్నా యాజ మాన్యం, ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరివల్ల వాటి ఏర్పాటు కు మోక్షం లభించడం లేదు. అండర్ గ్రౌండ్ మైన్‌లను ఓసీపీలుగా మార్చకుండా వాటి జీవితకాలం పెంచితే మరింతకాలం బొగ్గు ఉత్పత్తి సాధించే అవకాశాలు ఉన్నాయి.
మూసివేత దిశగా సూపర్ బజార్లు...
సింగరేణిలో క్రమంగా కార్మికుల సంఖ్య తగ్గుతుం డటంతో కాలనీల్లో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ బజార్లు కూడా మూత పడుతున్నాయి. సింగ రేణి కార్మికులకు అవసరమైన పచార సరుకులు నెల కు సరిపడా సూపర్ బజార్‌లలో లభించేవి. కిరాణా సామగ్రి నుంచి మొదలుకొని టీవీలు, ఫ్రిజ్‌లు, తదితర గృహోపకర వస్తువులు సైతం బయట మార్కెట్ క న్నా...తక్కువ ధరలో లభించేవి. వేతనాలు చేతికందా యంటే చాలు....కార్మికుల కుటుంబాలు సూపర్ బజార్ల బాట పట్టేవి. నెలకు సరిపడా సరుకులన్నీ తెచ్చుకొనేవి. కాలక్రమంలో కార్మికుల సంఖ్య తగ్గుతుండటంతో క్ర మేపీ సూపర్ బజార్‌ల సంఖ్యను కూడా తగ్గిస్తున్నారు.
షాఫ్ట్‌బ్లాక్ మైనింగ్‌తో మరింత మనుగడ...
సింగరేణి వ్యాప్తంగా ఓపెన్‌కాస్టు గనులలో ప్రస్తు తం 300 మీటర్ల లోనికి వెళ్లి బొగ్గును వెలికితీసే టెక్నా లజీ ఉంది. అయితే కొత్తగూడెంలో షాఫ్ట్ బ్లాక్ మైనిం గ్‌తో 700 మీటర్ల వరకు లోనికి వెళ్లే వెసులుబాటు ఉం ది. అదేమాదిరిగా ఇక్కడి ఓసీపీలను కూడా షాఫ్ట్‌బ్లాక్ మైన్స్‌గా ఆధునీకరిస్తే మరో 300 నుంచి 400 మీటర్ల వరకు అదనపు తవ్వకాలు జరిపే అవకాశం ఏర్పడు తుంది. ఇందారం, శ్రీరాంపూర్ ఓసీపీల సామర్థ్యం మ రింతగా పెంచే అవకాశాలను యాజమాన్యం పరిగణ లోకి తీసుకోవాలనే అభిప్రాయాలు ఉన్నాయి.
ప్రభుత్వాలు చొరవ తీసుకుంటేనే....
సింగరేణి మనుగడ కోసం 51:49 శాతం వాటా కలిగి ఉన్న కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుంటేనే సంస్థకు పూర్వవైభవం వస్తుంది. జిల్లాలోని మూడు సింగరేణి ఏరియాలలో నాలుగు దశాబ్దాలపాటు ఉపయోగపడేలా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. బొగ్గు ఉత్పత్తికి ఎలాంటి కొరతలేదు. కొత్తగా అండర్ గ్రౌండ్ మైన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టి బొగ్గు తవ్వకాలు జరపాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా సింగరేణి యాజమాన్యం కృషి చేయాల్సిన అవసరం ఉంది.