కాలేజీలు దూరం..చదువులు భారం
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:04 PM
పదో తరగతి పరీక్షలు కొన సాగుతున్నాయి. జిల్లాలో 9,703 మంది విద్యార్థులు పరీక్షలు రా స్తున్నారు. ఇందులో బాలురు 4,896 మంది, బాలికలు 4,807 మం ది ఉన్నారు. 80 శాతం ఉత్తీర్ణత సాధించినా దాదాపు 8 వేల మం ది పైచదువులకు వెళ్లాలి.
-9 మండలాల్లో ఇంటర్ విద్యకు ఇక్కట్లు
-నాలుగు మండలాల్లో కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు
-ఈసారైన ప్రారంభించాలని వేడుకోలు
నెన్నెల, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి పరీక్షలు కొన సాగుతున్నాయి. జిల్లాలో 9,703 మంది విద్యార్థులు పరీక్షలు రా స్తున్నారు. ఇందులో బాలురు 4,896 మంది, బాలికలు 4,807 మం ది ఉన్నారు. 80 శాతం ఉత్తీర్ణత సాధించినా దాదాపు 8 వేల మం ది పైచదువులకు వెళ్లాలి. కానీ అందులో సగం మంది కూడా ఇం టర్‌లో చేరే పరిస్థితులు లేవు. మారుమూల మండలాల్లో స్థానికం గా జూనియర్ కాలేజీలు లేక పోవడం పల్లె విద్యార్థులకు శాపంగా మారింది. దూరంగా పంపించే స్థోమత చాలా మంది తల్లిదండ్రు లకు లేకపోవడంతో పల్లె విద్యార్థులు పదో తరగతితోనే చదువులు ఆపేసే దుస్థితి ఉంది. నెన్నెల, తాండూరు, వేమనపల్లి మండలా లు జూనియర్ కాలేజీల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయని, మూలధనం జమ చేస్తే కళాశాలలు ఏర్పాటు చేస్తామని ఇంటర్ బోర్డు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ఎవరూ పట్టించు కోక పోవడంతో ఆయా మండలాల్లో కాలేజీలు ఏర్పాటు కావడం లేదు. గ్రామీణ విద్యార్థులు సైతం ఇంటర్ విద్యను అభ్యసించేలా కాలేజీల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసు కోవాల్సిన అవసరం ఎంతైన ఉంది.
- జిల్లాలో పదే ప్రభుత్వ కళాశాలలు..
జిల్లాలో పది ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. మిగతా తొమ్మిది మండలాల్లో లేక పోవడంతో ఆయా మండలాల విద్యార్థు లకు కళాశాల విద్య అందడం లేదు. బెల్లంపల్లి నియోజకవర్గం మరింత వెనుకబడి ఉంది. బెల్లంపల్లి, కాసిపేటలో మాత్రమే కాలే జీలున్నాయి. నెన్నెల, వేమనపల్లి, భీమిని, కన్నెపల్లి, తాండూరు మండలాల్లో జూనియర్ కాలేజీలు లేవు. మండలాల్లో కాలేజీలు లే క పోవడంతో అక్కడి విద్యార్థులు ఇంటర్ చదువు కోసం ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. దూరంగా ఉన్న కళాశాలలకు వెళ్లేందు కు సరైన రవాణా సౌకర్యంలేక, ఆర్థిక భారం పడుతుండటంతో చా లా మంది చదువుకోవడం లేదు. మండలానికి ఒక్క ప్రభుత్వ జూ నియర్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ప్రభుత్వ కాలేజీల ఏర్పాటు కోసం విద్యార్థి సంఘాలు ఆం దోళనలు చేస్తూనే ఉన్నాయి ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధుల కు వినతి పత్రాలు సమర్పిస్తున్నప్పటికీ మండలాల్లో ప్రభుత్వ జూ నియర్ కాలేజీల ఏర్పాటు మాత్రం జరగడం లేదు.
- మూలధనం చెల్లిస్తే ఏర్పాటు..
నెన్నెల, వేమనపల్లి, తాండూరు మండలాల్లో జూనియర్ కాలే జీల ఏర్పాటుకు ఇంటర్ బోర్డు నాలుగేళ్ల కిందటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని, సీడీసీ పేరిట బ్యాంకు ఖాతా తెరిచి అందులో రూ. 3.12 లక్షలు కార్పస్ ఫండ్‌గా జమ చేయాలని పేర్కొంది. మూలధనం సమకూర్చుకొని, స్థానికంగా భవనం, వసతులు కల్పిస్తామని తీర్మాణం చేసి ఇంటర్ బోర్డుకు పంపించాల్సి ఉంది. కాని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ దిశగా కృషి చేయక పోవడంతో కాలేజీల ఏర్పాటుకు అడుగు ముందుకు పడటం లేదు. ఇటీవల దండెపల్లి మండలంలో కాలేజీ ఏర్పాటు కోసం బోర్డుకు అప్రూవల్ పంపించారు.
-చొరవ తీసుకుంటే ఏర్పాటు సులువే..
ఉన్నాతాధికారులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకుంటే మా రుమూల మండలాల్లో జూనియర్ కాలేజీల ఏర్పాటు పెద్ద కష్టం ఏమి కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్ని కల కంటే ముందు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మండలాల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇచ్చిన హామి నెరవేర్చాలని పేరెంట్స్, పదో తగతి విధ్యార్థులు కోరుతున్నారు.
నాలుగు కాలేజీలకు ప్రతిపాదనలు పంపించాం
కె. అంజయ్య, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి
నెన్నెల, వేమనపల్లి, తాండూరు, దండెపల్లి మండలాల్లో జూని యర్ కాలేజీల ఏర్పాటుకు బోర్డ్ ఆఫ్ ఇంటర్ మీడియట్‌కు ప్రతి పాదనలు పంపించాం. ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాబోయే విద్యా సంవత్సరం నుంచి కొత్త వి ద్యా పాలసీ అమలులోకి వస్తోంది. దీంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
-మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలి
అద్దరపల్లి మౌనిక, పదో తరగతి విద్యార్థి, మైలారం
మాది వ్యవసాయ కుటుంబం. మైలారంలో జడ్పీ స్కూల్‌లో ప దో తరగతి చదివి పరీక్షలు రాస్తున్నాను. మంచి మార్కులతో పాస్ అవుతాననే నమ్మకం ఉంది. ఇంటర్మీడియట్ చదవువాలని ఉంది. కాని స్థానికంగా జూనియర్ కాలేజీ లేదు. 30 కిలోమీటర్ల దూరం లోని బెల్లంపల్లికి వెళ్లి కాలేజీ చేయడం సాధ్యపడదు. గ్రా మీణ ప్రాంతాల విధ్యార్థుల కోసం మండల కేంద్రంల్లో జూనియర్ కాలేజీ లు ఏర్పాటు చేయాలి. ఈ విద్యాసంవత్సరం ప్రారంభాని కల్లా ఇంటర్ విద్య మొదలు పెడితే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది.