Share News

ఉమామహేశ్వరస్వామి సన్నిధిలో కలెక్టర్‌ కుటుంబ సభ్యులు

ABN , Publish Date - Jun 14 , 2026 | 11:55 PM

మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమామశేశ్వర దేవస్థానాన్ని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఆ దివారం దర్శించుకున్నారు.

ఉమామహేశ్వరస్వామి సన్నిధిలో కలెక్టర్‌ కుటుంబ సభ్యులు
ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌, కుటుంబ సభ్యులు

అచ్చంపేట, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమామశేశ్వర దేవస్థానాన్ని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఆ దివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరు కున్న కలెక్టర్‌కు అర్చకులు, ఆలయ అధికారు లు సంప్రదాయబద్ధంగా పూర్ణ కుంభంతో స్వా గతం పలికి ఘనంగా ఆహ్వానించారు. అనంత రం కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ మాట్లాడు తూ కుటుంబ సమేతంగా ఆలయంలోని ఉమా మహేశ్వరస్వామి వారిని, అమ్మవార్లను దర్శిం చుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రో చ్ఛారణాలతో నిర్వహించిన ప్రత్యేక అర్చనలు, అభిషేక పూజల్లో పాల్గొన్నారు. కలెక్టర్‌ కుటుంబ సభ్యులకు అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అం దించారు. అనంతరం శాలువాతో సత్కరించి ఆలయ విశిష్ట తను వివరించారు. నల్లమల అటవీ ప్రాంతంలో వెలిసిన ఈ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిందని, ప్రతీ సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామి వారి ఆశీస్సులు పొందుతారని అర్చకులు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ ఆలయ ప్రాం గణం, పరిసర ప్రాంతాలను పరిశీలించి భక్తుల కు అందుతున్న సౌకర్యాల గురించి ఆలయ అధికారులను అడిగి తెలుసు కున్నారు. ఆలయ పరిసరాల్లో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణా న్ని ఆస్వాదిస్తూ కొంత సేపు గడిపారు. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక ప్రశాంతత, చారిత్రక వైభ వానికి ప్రతీకగా నిలిచిన ఉమామహేశ్వర దేవ స్థానం సందర్శన కలెక్టర్‌ కుటుంబ సభ్యులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ తెలిపారు. కార్యక్ర మంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2026 | 11:55 PM