బాల రక్షక భవన్‌ను సందర్శించిన కలెక్టర్
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:11 AM
పెద్దపల్లి పట్టణం రంగంపల్లిలో గల బాల రక్షక భవన్‌ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం తనిఖీ చేశారు. అక్కడి అధికా రులు, సిబ్బందితో ఆయన మాట్లాడారు. చిన్నారుల సంరక్షణకు సంబంధించి సమీక్షిం చారు. జాబ్ చార్ట్ ప్రకారం తప్పనిసరిగా
పెద్దపల్లి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి పట్టణం రంగంపల్లిలో గల బాల రక్షక భవన్‌ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం తనిఖీ చేశారు. అక్కడి అధికా రులు, సిబ్బందితో ఆయన మాట్లాడారు. చిన్నారుల సంరక్షణకు సంబంధించి సమీక్షిం చారు. జాబ్ చార్ట్ ప్రకారం తప్పనిసరిగా విధులు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశిం చారు. పోక్సో కేసుల వివరాలను తెలుసుకున్న కలెక్టర్ బాలలపై లైంగిక వేధింపుల వంటివి చోటు చేసుకున్నప్పుడు బాధిత చిన్నారులకు సకాలంలో రక్షణ, అవసరమైన సహాయం, కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు.
ఫ సుల్తానాబాద్ : సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని సంస్థల్లో వసతి పొందుతున్న చిన్నా రులు, వృద్ధులకు మెరుగైన సౌకర్యాలు, భద్రత, అవసరమైన సంరక్షణ అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళ వారం సుల్తానాబాద్ మండలంలోని క్యాడర్ దివ్యాంగుల పాఠశాల, వృద్ధాశ్రమం, బాలస దనం, మండల విద్యా వనరుల కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాలలు, డార్మిటరీలను పరిశీలించిన కలెక్టర్ పరిశుభ్రత, ఆహార నాణ్యత, వసతి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది నిర్ణీత సమయానికి విధులకు హాజరై బాధ్యతలను సమర్థవంతంగానిర్వహిం చాలని సూచించారు. చిన్నారు లు, వృద్ధుల ఆరోగ్యం, భద్రత, ఆహారం, వసతి తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షిం చాలని ఆదేశించారు. బాలల రక్షణ, సంరక్ష ణకు సంబంధించిన కేసులను సున్నితంగా పరిగణించి, బాధితులకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా చూడాలన్నారు.
ఫ సుల్తానాబాద్ సీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపరచాలి
పెద్దపల్లి: సుల్తానాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళ వారం కలెక్టరేట్‌లో సీహెచ్‌సీ నిర్వహణ, వైద్య సేవలు, సిబ్బంది విధులపై సమీక్ష నిర్వహించారు. వైద్యులు, సిబ్బంది నిర్ణీత సమయానికి విధులకు హాజరై బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, డెంటల్ విభాగంలో అందుబా టులో ఉన్న సదుపాయాలను పూర్తిస్థాయి లో వినియోగించి కొత్త విధానాలను ప్రారంభించాలని ఆదేశించారు. ఆసుప త్రి షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల అద్దెల పెంపు నకు వారం రోజుల్లో నోటీసులు జారీ చేయాలని సూచించారు.