kumaram bheem asifabad- పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
ABN , Publish Date - Jul 15 , 2026 | 10:37 PM
పెంచికల్‌పేట మండలం చెడ్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కె.హరిత బుధవారం తనిఖీ చేశారు. తరగతి గదుల్లో విద్యార్థులను ప్రశ్నించి వారి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు. గుణాత్మక విద్యతో పాటు పోషకాహారం అందించాలని, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకరావాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
పెంచికల్‌పేట, జూలై 15 (ఆంధ్రజ్యోతి): పెంచికల్‌పేట మండలం చెడ్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కె.హరిత బుధవారం తనిఖీ చేశారు. తరగతి గదుల్లో విద్యార్థులను ప్రశ్నించి వారి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు. గుణాత్మక విద్యతో పాటు పోషకాహారం అందించాలని, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకరావాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల పరిశుభ్రత, వర్షాకాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇంకుడు గుంతలు పనులు వేగవంతంగా చేయాలన్నారు. అనంతరం చెడ్వాయి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు, తడి పొడగి చెత్త వేర్వెరుగా సేకరణ, తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఇంటి పన్ను వసూళ్లను పూర్తి స్థాయిలో రాబట్టి పంచాయతీ ఆదాయాన్ని పెంచాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ చౌదరి శ్రీనివాస్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
కాగజ్‌నగర్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కాగజ్‌నగర్ మండలం ఈసుగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. అలాగే సీజనల్ వ్యాధుల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో కూడా పారిశుద్య పనులు ఎప్పటికప్పుడు చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.